కుప్పకూలిన టీమిండియా టాప్‌ ఆర్డర్‌

లంచ్‌ సమయానికి 51 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన భారత్‌

Advertisement
Update:2024-11-22 10:09 IST

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫిలో భాగంగా పెర్త్‌లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకున్నది. ఆసీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. మొదటి ఇన్నింగ్స్‌లో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 51 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రిషభ్‌ పంత్‌ (10 నాటౌట్‌), ధ్రువ్‌ జురెల్‌ (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. యశస్వి (0), పడిక్కల్‌ (0), కోహ్లీ (5), కేఎల్‌ రాహుల్‌ (26) రన్స్‌ కు వెనుదిరిగాడు. ఆసీస్‌ బౌలర్లలో హెజల్‌వుడ్‌, స్టార్క్‌ చెరో రెండు వికెట్ల తీశారు. మరోవైపు కేఎల్‌ రాహుల్‌ టెస్ట్‌ల్లో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

తుది జట్టులో కొత్త యువ ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌రెడ్డి, హర్షిత్‌ రాణాలకు అవకాశం దక్కింది. వేలికి అయిన గాయం నుంచి కోలుకుంటానని భావించిన గిల్‌కు మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. దీంతో అతని గాయం తీవ్రతపై అభిమానుల్లో ఆందోళన నెలకొన్నది. ఈ క్రమంలో బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది.

శుభ్‌మన్‌ గిల్‌ వేలుకు గాయమైంది. వాకాలో వార్మప్‌ మ్యాచ్‌ సందర్బంగా గాయపడ్డాడు. పూర్తిగా కోలుకోవడానికి అతడికి తొలి టెస్ట్‌కు ఎంపిక చేయలేదు. బీసీసీఐ డాక్టర్ల బృందం నిరంతరం అతడి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నదని బీసీసీఐ వెల్లడించింది.

పెర్త్‌ టెస్ట్‌కు రుదైన ఘనత

పెర్త్‌ టెస్ట్‌కు ఓ అరుదైన ఘనత దక్కింది. 1947 తర్వాత మొదటిసారి ఇరు జట్ల సారథులూ బౌలర్లే కావడం ఇదే ప్రథమం. భారత జట్టుకు జస్‌ప్రీత్‌ బూమ్రా, ఆసీస్‌కు ప్యాట్‌ కమిన్స్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో బూమ్రా జట్టు పగ్గాలు దక్కాయి.

భారత్‌: యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ, రిషభ్‌పంత్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, సిరాజ్‌, బూమ్రా

ఆస్ట్రేలియా: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్‌, స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, అలెక్స్‌ కేరీ, స్టార్క్‌, కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌

Tags:    
Advertisement

Similar News