ఇంగ్లండ్ నెత్తిన పిడుగు...టీ-20 ప్రపంచకప్ కు బెన్ స్టోక్స్ డుమ్మా!

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు గట్టి దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీకి తాను దూరమని స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రకటించాడు.

Advertisement
Update:2024-04-02 17:31 IST

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు గట్టి దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీకి తాను దూరమని స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రకటించాడు.

కరీబియన్ ద్వీపాలు, అమెరికా సంయుక్త ఆతిథ్యంలో మరి కొద్దివారాలలో ప్రారంభంకానున్న ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు తాను దూరమని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ కమ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రకటించడం ద్వారా కలకలం రేపాడు.

టెస్టుల కోసం టీ-20లకు దూరం...

ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో భారీగా కాసులు కురిపించే టీ-20 క్రికెట్ కోసం ప్రముఖ ఆటగాళ్లంతా సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు డుమ్మా కొడుతుంటే ప్రపంచ మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్న బెన్ స్టోక్స్ త్వరలో తమజట్టు ఆడాల్సిన టెస్టు సిరీస్ లను దృష్టిలో ఉంచుకొని టీ-20 ప్రపంచకప్ కు దూరంగా ఉండాలని, తన దృష్టి అంతా సాంప్రదాయ టెస్టు క్రికెట్ పైనే కేంద్రీకరించాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు.

ప్రస్తుత 2025 సీజన్లో ఇంగ్లండ్ 12 టెస్టుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే భారత్ తో ఐదుమ్యాచ్ ల సిరీస్ ను పూర్తి చేసి వెళ్లింది. మిగిలిన టెస్టుల్లో తాను పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా అందుబాటులో ఉండాలంటే టీ-20 ప్రపంచకప్ కు దూరంగా ఉండటం అనివార్యమని స్టోక్స్ వివరించాడు.

ఐపీఎల్ కూ స్టోక్స్ దూరం....

కోట్లరూపాయల ఐపీఎల్ కాంట్రాక్టును సైతం బెన్ స్టోక్స్ కాదనుకొని టెస్ట్ ఫార్మాట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. మోకాలి గాయానికి ఆపరేషన్ అనంతరం తొమ్మిది మాసాలపాటు బౌలింగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చిందని, బౌలింగ్ ఫిట్ నెస్ కోసం కౌంటీ క్రికెట్లో దర్హం జట్టులో సభ్యుడిగా ఆడటం ద్వారా పూర్తి ఫిట్ నెస్ సాధించడమే తన లక్ష్యమని బెన్ ప్రకటించాడు.

జూన్ నెలలో ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ బరిలో ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో దిగనుంది. జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు

2024 టీ-20 ప్రపంచకప్ లో సైతం అత్యుత్తమంగా రాణించడం ద్వారా టైటిల్ నిలుపుకోవాలని కోరుకొంటున్నట్లు బెన్ ఓ ప్రకటన విడుదల చేశాడు.

భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ సెమీస్ చేరడంలో విఫలమైన ఇంగ్లండ్ ..ఆ లోటును టీ-20 ప్రపంచకప్ ద్వారా పూడ్చుకోవాలని భావిస్తోంది.

గత టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ ను 5 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్..2024 ప్రపంచకప్ లో మాత్రం జూన్ 4న స్కాట్లాండ్, జూన్ 8న ఆస్ట్ర్రేలియా, జూన్ 13న ఓమన్, జూన్ 15న నమీబియా జట్లతో గ్రూపు లీగ్ లో తలపడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News