స్టింగ్ ఆపరేషన్ తో చేతన్ కంగు, చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా!

భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ పదవి నెలరోజుల ముచ్చటగా ముగిసిపోయింది. స్టింగ్ ఆపరేషన్ దెబ్బతో తన పదవికీ రాజీనామా చేసినట్లు మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మ ప్రకటించాడు.

Advertisement
Update:2023-02-17 13:06 IST

స్టింగ్ ఆపరేషన్ తో చేతన్ కంగు, చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా!

భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ పదవి నెలరోజుల ముచ్చటగా ముగిసిపోయింది. స్టింగ్ ఆపరేషన్ దెబ్బతో తన పదవికీ రాజీనామా చేసినట్లు మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మ ప్రకటించాడు.

భారత క్రికెట్లో అంతర్గత రాజకీయాలు మరోసారి బయట పడ్డాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా నెలరోజుల క్రితమే పదవి చేపట్టిన మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసి కలకలం సృష్టించాడు.

ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ బీసీసీఐ అంతర్గత విషయాలు, రాజకీయాలపై తన మనసులో మాట బయట పెట్టి చిక్కుల్లో పడ్డాడు.

గంగూలీ పై కొహ్లీ గరంగరం...

తనను భారత కెప్టెన్ పదవి నుంచి తప్పించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి చెప్పలేని కోపం ఉందని, గంగూలీ పరువు తీయటానికి విరాట్ కొహ్లీ పలు విధాలుగా ప్రయత్నించాడంటూ చేతన్ శర్మ చెప్పినట్లుగా రహస్యంగా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయట పడింది.

బీసీసీఐ చైర్మన్ గా సౌరవ్ గంగూలీ తో విరాట్ కొహ్లీకి సత్సంబంధాలు లేవని కూడా చేతన్ శర్మ వ్యాఖ్యానించాడు.

రోహిత్ కెప్టెన్సీకి హార్థిక్ పాండ్యా ఎసరు?

భారత కెప్టెన్ రోహిత్ శర్మతో తాను 30 నిముషాలపాటు రహస్యంగా సంభాషించినట్లు, రోహిత్ కెప్టెన్సీకి హార్థిక్ పాండ్యా ఎసరు పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టాడు.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా పలు అంశాలపై గోప్యత పాటించాల్సిన చేతన్ శర్మ..సంయమనం కోల్పోయి ..స్టింగ్ ఆపరేషన్ లో వెల్లడించడం వివాదాస్పదంగా మారింది.

తాను మాట్లాడిన వాస్తవాలు..వివాదాలుగా బయటకు రావడంతో..చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. తన రాజీనామా లేఖను బోర్డు కార్యదర్శి జే షాకు పంపాడు.

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా గతంలో ఓ మారు సస్పెన్షన్ కు గురైన చేతన్ శర్మన గత నెలలోనే రెండోసారి నియమించారు. అయితే స్టింగ్ ఆపరేషన్ దెబ్బతో తన పదవీ కాలం నెలరోజుల ముచ్చటగా ముగిసిపోయింది.

పదవి కోల్పోడం ద్వారా చేతన్ శర్మ ఏడాదికి 80 లక్షల రూపాయల వేతనాన్ని సైతం చేజార్చుకోవాల్సి వచ్చింది. 1980 దశకంలో భారత మీడియం పేస్ ఆల్ రౌండర్ గా రాణించిన చేతన్ శర్మ కు భవిష్యత్ లో ఏ విధమైన బీసీసీఐ పదవి దక్కే అవకాశం లేకుండాపోయింది.

నోటిపై అదుపులేకుంటే ఎంత నష్టం జరుగుతుందో చేతన్ శర్మను చూస్తేనే తెలుస్తుంది. ఇది మాత్రం భారత , ప్రధానంగా తెలుగు రాష్ట్ర్రాల రాజకీయనాయకులకు ఏమాత్రం వర్తించదు. నోటికొచ్చినట్లు మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా పదవులు పట్టుకొని వేలాడటంలో మన రాజకీయనాయకులు తర్వాతే ఎవరైనా.

క్రికెటర్లు కనుక వాస్తవాలను మాట్లాడి చిక్కులు కొని తెచ్చుకొన్నా..నైతిక విలువలకు లోబడి పదవికి రాజీనామా చేస్తూ పక్కకు తప్పుకోగలుగుతున్నారు.

Tags:    
Advertisement

Similar News