టీ20 ఉమెన్ వరల్డ్‌ కప్‌లో.. కివీస్‌తో తొలి సమరానికి భారత్ సై

ఐసీసీ మహిళ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి సమరానికి భారత మహిళ జట్టు సిద్ధమైంది. నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడనున్నాయి

Advertisement
Update:2024-10-04 17:18 IST

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళ టీ20 వరల్డ్‌ కప్‌లో తొలి సమరానికి భారత మహిళ జట్టు సిద్ధమైంది. ఎన్నోఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని ఈసారి ఎలాగైనా గెలవాలని ఉమెన్ జట్టు బరిలోకి దిగుతోంది. గ్రూప్‌-Aలో భాగంగా టీమిండియా శుక్రవారం న్యూజిలాండ్‌ జట్టుతో తలపడబోతోంది. ఎలాగైనా శాయశక్తులు ఒడ్డి అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ చేరాలని భారత జట్టు కలలు కంటోంది. అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నా.. గెలివాల్సిన మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోంది. అన్ని విభాగాల్లో భారత్ బలంగా ఉన్న.. గెలివాల్సిన మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోంది.

కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జెమీమా, షఫాలీ, దీప్తిశర్మ బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. పూజా వస్త్రాకర్‌, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌‌లలో ఇద్దరు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. ఇక ప్రత్యర్థి కీవిస్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. సోఫీ డివైన్‌ సారథ్యంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సుజీ బేట్స్‌, వెటరన్‌ పేసర్లు లియా తహుహు, లీగ్‌ కాస్పెరెక్‌ ఫామ్‌తో బ్లాక్ క్యాప్స్ భారత జట్టుకు సవాలు విసురుతోంది. దుబాయ్ వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags:    
Advertisement

Similar News