Tecno Pop 8 | టెక్నో నుంచి మ‌రో ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ టెక్నో పాప్‌8.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!

Tecno Pop 8 | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్‌ను బుధ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Advertisement
Update:2024-01-04 08:30 IST
Tecno Pop 8 | టెక్నో నుంచి మ‌రో ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్ ఫోన్ టెక్నో పాప్‌8.. ఇవీ స్పెషిపికేష‌న్స్‌..!
  • whatsapp icon

Tecno Pop 8 | ప్ర‌ముఖ స్మార్ట్‌ఫోన్ల త‌యారీ సంస్థ టెక్నో (Tecno) త‌న టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్‌ను బుధ‌వారం భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. గ‌త అక్టోబ‌ర్‌లోనే గ్లోబ‌ల్ మార్కెట్లో విడ‌ద‌ల చేసింది. ఒక్టాకోర్ యూనిసోక్ చిప్‌సెట్ (octa-core Unisoc chipset), 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌చ్చింది. ఫ్రంట్‌లో డ్యుయ‌ల్ ఫ్లాష్ యూనిట్ (dual flash unit) క‌లిగి ఉంటుంది. సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ కాన్ఫిగ‌రేష‌న్‌తో వ‌స్తున్న ఎంట్రీ లెవ‌ల్ స్మార్ట్‌ఫోన్‌.. టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్ అమ్మ‌కాలు ఈ నెలాఖ‌రులో దేశంలో ప్రారంభం అవుతాయి.

టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్ గ్రావిటీ బ్లాక్ (Gravity Black), మిస్ట‌రీ వైట్ (Mystery White) క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. భార‌త్ మార్కెట్లోకి టెక్నో పాప్ 8 (Tecno Pop 8) సింగిల్ కాన్ఫిగ‌రేష‌న్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా వ‌స్తుంది. ఈ నెల తొమ్మిదో తేదీ మ‌ధ్యాహ్నం నుంచి విక్ర‌యాలు ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ ధ‌ర రూ.6,499 (ఎక్స్ షోరూమ్‌) గా నిర్ణ‌యించారు. స్పెష‌ల్ లాంచ్ ఆఫ‌ర్ కింద రూ. 5,999 ల‌కు లిమిటెడ్ పీరియ‌డ్ ల‌భిస్తుంది. ఈ స్పెష‌ల్ ప్రైస్‌లోనే బ్యాంక్ ఆఫ‌ర్లు కూడా ఉంటాయి.

టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ + (1,612 x 720 పిక్సెల్స్‌) డాట్‌-ఇన్‌-డిస్‌ప్లే అండ్ యాస్పెక్ట్ రేషియో 20:9 క‌లిగి ఉంటుంది. క్విక్ నోటిఫికేష‌న్ల కోసం ఆపిల్ డైన‌మిక్ ఐలాండ్‌ను పోలిన డైన‌మిక్ పోర్ట్ ఫీచ‌ర్ కూడా వ‌స్తుంది. యూనిసోక్ టీ 606 ఎస్వోసీ చిప్ సెట్ (Unisoc T606 SoC), 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ క‌లిగి ఉంటుంది. వ‌ర్చువ‌ల్‌గా ర్యామ్ మ‌రో 4 జీబీ పెంచుకుని 8జీబీ వ‌ర‌కూ విస్త‌రించ‌వ‌చ్చు. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కూ స్టోరేజీ పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 13 గో ఎడిష‌న్ బేస్డ్ హెచ్ఐఓఎస్ 13 వ‌ర్ష‌న్‌పై ఈ ఫోన్ ప‌ని చేస్తుంది.

టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్ 12-మెగా పిక్సెల్ ఏఐ-అసిస్టెడ్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ క‌లిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్స్ సెన్స‌ర్ విత్ డ్యుయ‌ల్ ఎల్ఈడీ మైక్రో స్లిట్ ఫ్లాష్ లైట్ వ‌స్తుంది. డీటీఎస్‌-బ్యాక్డ్ స్టీరియో స్పీక‌ర్స్ జ‌త చేశారు. దీంతో ఇత‌ర ఫోన్ల‌తో పోలిస్తే ఇందులో 400 శాతం ఎక్కువ శ‌బ్ధం వినిపిస్తుంది.

టెక్నో పాప్ 8 (Tecno Pop 8) ఫోన్ 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది. ఈ ఫోన్ 4జీ వోల్ట్‌, వై-ఫై 802.11, బ్లూటూత్‌ 5.0, జీపీఎస్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్ క‌లిగి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News