మిడ్‌రేంజ్ బడ్జెట్‌లో ఒప్పో ఎఫ్ 27 5జీ! ఫీచర్లివే..

Oppo F27 5G: ఒప్పో నుంచి రిలీజైన ఒప్పో ‘ఎఫ్27 5జీ (Oppo F27 5G)’ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.

Advertisement
Update: 2024-08-21 12:38 GMT

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో నుంచి ‘ఒప్పో ఎఫ్27 5జీ (Oppo F27 5G)’ పేరుతో ఇండియన్ మార్కెట్లో ఓ ఫోన్ లాంఛ్ అయింది. ఈ మొబైల్ ధర, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే..

ఒప్పో నుంచి రిలీజైన ఒప్పో ‘ఎఫ్27 5జీ (Oppo F27 5G)’ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 యూఐపై రన్ అవుతుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుని సపోర్ట్ చేస్తుంది. 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది.

ఒప్పో ఎఫ్27 5జీ కెమెరాల విషయానికొస్తే.. ఇది డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌‌తో పాటు మరో 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. ముందువైపు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

ఒప్పో ఎఫ్27 5జీ మొబైల్‌లో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. అలాగే ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లున్నాయి.

ఒప్పో ఎఫ్27 5జీ (8 జీబీ+ 128 జీబీ) వేరియంట్ ధర రూ.22,999 ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 ఉంది. అంబర్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Tags:    
Advertisement

Similar News