వేరే వాళ్ల పేరుతో సిమ్‌ కొన్నారా? అయితే సిమ్‌ బ్లాక్‌ అయిపోవచ్చు!

దేశవ్యాప్తంగా 1.77 కోట్ల సిమ్‌ కార్డులు బ్లాక్‌ చేసిన కేంద్రం

Advertisement
Update:2024-10-07 19:02 IST

దేశవ్యాప్తంగా అన్ని టెలీకామ్‌ నెట్‌ వర్క్‌ లకు చెందిన 1.77 కోట్ల సిమ్‌ కార్డులను కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ బ్లాక్‌ చేసింది. నకిలీ ఆధార్‌ కార్డులు, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ఈ సిమ్‌ కార్డులు కొనుగోలు చేశారని కేంద్రం గుర్తించింది. జియో, ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ - ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇలా నకిలీ పత్రాలతో కొన్ని సిమ్‌ లు గుర్తించి వాటిని డీ యాక్టివేట్‌ చేసింది. ఒకరి పేరుతో సిమ్‌ కార్డు తీసుకొని మరొకరు వినియోగిస్తుంటే కూడా ఆ సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేస్తోంది. సైబర్‌ నేరాలను అరికట్టడానికి, స్పామ్‌ కాల్స్‌ ఆపడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. వినియోగదారులు ఇచ్చిన పత్రాలు అసలా, నకిలీవా గుర్తించడానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయం తీససుకుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని ఇలాంటి సిమ్‌ లను గుర్తించి బ్లాక్‌ చేస్తామని కేంద్రం వెల్లడించింది. అలాగే 11 లక్షల ఎకౌంట్లు, పేమెంట్‌ వాలెట్లను ఫ్రీజ్‌ చేశామని వెల్లడించింది.

మీ సిమ్‌ కార్డు గురించి తెలుసుకోవాలా?

మీరు వినియోగిస్తున్నసిమ్‌ కార్డు ఎవరి ఆధార్‌ కార్డుపై జారీ చేశారో తెలుసుకోవడానికి tafcop.sancharsaathi.gov.in వెబ్‌ సైట్‌ కు వెళ్లాలి.. అందులో మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.. ఆ నంబర్‌ కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేయాలి.. అప్పుడు మీ సిమ్‌ కార్డు ఎవరి పేరుపై తీసుకున్నారనే వివరాలు వస్తాయి. అలాగే ఒక ఆధార్‌ నంబర్‌ పై ఎన్ని సిమ్‌ కార్డులు జారీ చేశారనే వివరాలు డిస్‌ ప్లే అవుతాయి.

Tags:    
Advertisement

Similar News