40 ఏళ్ల కింద క్యాంపస్‌ ప్లేస్‌ మెంట్‌.. టీసీఎస్‌ లో జీతమెంతో తెలుసా?

తన ఆఫర్‌ లెటర్‌ పోస్ట్‌ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌

Advertisement
Update:2024-10-01 17:56 IST

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌).. లక్షలాది మంది యువతకు అందులో ఉద్యోగం చేయడం డ్రీమ్‌.. టాప్‌ మల్టీ నేషనల్‌ కంపెనీల్లో టీసీఎస్‌ ఒకటి. అలాంటి కంపెనీలో ఓ ఐఐటీయన్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ కొట్టేశాడు. ఆయనకు నెలకు జీతమెంతో తెలుసా.. రూ1,300. అందేటి ఐఐటీయన్‌ కు నెలకు రూ.1,300 జీతమెంటి? గంటకు ఇచ్చే పేమెంట్‌ కావొచ్చు అనుకోకండి.. నిజంగానే నెల జీతం అక్షరాల పదమూడు వందల రూపాయలు. ఆయన టీసీఎస్‌ లో ప్లేస్‌మెంట్‌ కొట్టేసింది ఇప్పుడు కాదులెండి.. సరిగ్గా 40 ఏళ్ల క్రితం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు. రాజస్థాన్‌ క్యాడర్‌ కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఐఐటీ బీహెచ్‌యూ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో రూ.1,300 జీతంలో ముంబయి టీసీఎస్‌ క్యాంపస్‌ లో 1984లో ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ముంబయిలోని నారిమన్‌ పాయింట్‌ లో గల ఎయిర్‌ ఇండియా 11వ ఫ్లోర్‌ నుంచి చూస్తే అరేబియా సముద్రం చాలా అద్భుతంగా ఉండేదని ఆయన తన పోస్ట్‌ లో పేర్కొన్నారు. కొంతకాలం టీసీఎస్‌ లో జాబ్‌ చేసిన తర్వాత మాస్టర్స్‌ కోసం న్యూయార్క్‌ కు వెళ్లారు. క్లార్క్‌ సన్‌ వర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రోహిత్‌ కుమార్‌ సింగ్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి ఐఏఎస్‌ కు సెలక్ట్‌ అయ్యారు. సర్వీస్‌ నుంచి రిటైర్‌ అయిన ఆయన ప్రస్తుతం నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్ప్యూట్స్‌ రెడ్రెస్సల్‌ కమిషన్‌ లో సేవలందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News