ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' పాటకు ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులు

ఇప్పుడు మరొక సప్రైజ్ ఏంటంటే.. లైవ్ షోలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాట పాడే సమయంలో ఎన్టీఆర్, చరణ్ స్టేజ్ పై డ్యాన్స్ వేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2023-03-01 12:00 IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని `నాటు నాటు` పాట గల్లీ నుంచి హాలీవుడ్ దాకా అందరికీ నచ్చింది. ఈ పాటకు ఎన్టీఆర్, చరణ్ వేసిన స్టెప్పులకు ఇంగ్లిష్ ప్రేక్షకులు కూడా ఫిదా అయి థియేటర్లలో డ్యాన్స్ లు వేశారు.

ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు గెల్చుకుంది. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది. ఈనెల 12వ తేదీన ఆస్కార్ అవార్డుల విజేతలను ప్రకటించనున్నారు. అయితే ఆస్కార్ అవార్డుల లైవ్ షోలో నాటు నాటు పాట ప్రదర్శించేందుకు ఈ పాటను పాడిన సింగర్లు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు ఆస్కార్ నిర్వాహకులు ఇటీవల ఆహ్వానం పలికారు.

ఇప్పుడు మరొక సప్రైజ్ ఏంటంటే.. లైవ్ షోలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాట పాడే సమయంలో ఎన్టీఆర్, చరణ్ స్టేజ్ పై డ్యాన్స్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ ఇద్దరు హీరోలు సిద్ధం అయినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ కావడమే గొప్ప విశేషం అయితే.. లైవ్ షోలో పాట పాడే అవకాశం రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలకు దక్కింది. ఇద్దరు టాలీవుడ్ సింగర్లు ఆస్కార్ వేదికపై పాట పాడే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్లు కాలు కదిపితే చూసేందుకు ఇండియాతో పాటు ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News