తుపాన్ బీభత్సం..సెల్ ఫోన్ చార్జింగ్ కోసం భారీ క్యూ

చైనాలో యాగి తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement
Update: 2024-09-12 12:49 GMT

చైనాలో యాగి తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్‌ఫోన్‌లో ఛార్జింగ్‌లు లేకపోవండంతో తాత్కాలిక ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. వాటి వద్ద ప్రజలు బారులు తీరారు. అలా బారులు తీరిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.

చైనాలోని హైనాన్‌ ప్రావిన్స్‌లో యాగి తుపాను తో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు పడ్డాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ అయిపోవడంతో డిజిటల్‌ పేమెంట్స్ కు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం నిత్యావసర సరకులు సైతం కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దాంతో ప్రభుత్వం ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటుచేయగా.. వాటి వద్ద తుపాను బాధితులు క్యూలైన్స్ లో బారులు తీరారు.

మరోవైపు యాగి తుపాను కారణంగా వియత్నాంలో వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 197కి చేరింది. ఇంకా 125 మంది జాడ తెలియలేదని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఉత్తర వియత్నాంలోని లావో కై ప్రావిన్స్‌లోని లాంగ్‌ను గ్రామం వరదలకు కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరగింది. ఇంకా పలువురి ఆచూకీ తెలియరాలేదు.వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా యాగి వంటి తుపానులు బలపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News