ఏపీలో అయితే సేవ చేయలేరా?

ఐఏఎస్‌ లను ప్రశ్నించిన క్యాట్‌

Advertisement
Update:2024-10-15 17:21 IST

ఏపీలో అయితే సేవ చేయలేరా అని ఐఏఎస్‌ అధికారులను సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించిన వాకాటి కరుణ, వాణిప్రసాద్‌, ఆమ్రపాలి, తెలంగాణకు కేటాయించి సృజన సహా మరో ఆరుగురు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ఈనెల 16లోగా వారికి కేటాయించిన రాష్ట్రంలో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ ఆదేశించింది. ఈ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ నలుగురు ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ ను మంగళవారం మధ్యాహ్నం విచారించిన క్యాట్‌ ఐఏఎస్‌ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి సేవ చేయాలేని లేదా అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. క్యాట్‌ ఆదేశాల నేపథ్యంలో 11 మంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాలను వదిలేసి వారికి కేటాయించిన రాష్ట్రంలో బుధవారం రిపోర్ట్‌ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News