మీరు గెలిస్తే ఇలాంటి ఆరోపణలు చేసేవారా?

ఓడిపోయారు కాబట్టే ప్రజలు తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయని ఏక్‌నాథ్‌ శిండే ఫైర్‌

Advertisement
Update:2024-12-08 17:22 IST

మహారాష్ట్రలోని విపక్షాలపై డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించకూడదంటూ విమర్శించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈవీఎంలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారు. ముందుగా ఎన్నికల ఫలితాలను అంగీకరించండి. ఒకవేళ ఎన్నికల్లో మీరు గెలిస్తే.. ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసే వారు కాదు. ఓడిపోయారు కాబట్టే ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓడిపోయామని ప్రతిపక్షాలు అంగీకరించక తప్పదు' అని శిండే ధ్వజమెత్తారు.

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు. అయినా ఓటు వేశారు. అమెరికా, ఇంగ్లండ్‌తో సహా ప్రపంచమంతా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నది. భారత్‌లో మాత్రమే ఈవీఎంలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై స్థానిక ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందజేయాలని వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తానని శరద్‌ పవార్‌ షోలాపూర్‌ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో యాంటి-ఈవీఎం కార్యక్రమంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శిండే విపక్షాలపై విరుచుకుపడ్డారు. 

Tags:    
Advertisement

Similar News