ఊలు 'వి'చిత్రాలు

చిత్రకళా మాధ్యమంతో చిత్రకారులు సృష్టికి ప్రతిసృష్టి చేశారు. ప్రపంచానికి భావాలను నేర్పించారు. భావ వ్యక్తీకరణను కళ్ల ముందు ఆవిష్కరించారు.

Advertisement
Update:2022-12-11 11:26 IST

చిత్రలేఖనం అద్భుతమైన కళ.

మనసు భావాలను కళ్లకు కట్టే మాధ్యమం.

మనసు పలికే మౌనగీతానికి దర్పణం.

మాటగా చెప్పలేని మనసు భావానికి రంగుల రూపం.


చిత్రకళా మాధ్యమంతో చిత్రకారులు సృష్టికి ప్రతిసృష్టి చేశారు. ప్రపంచానికి భావాలను నేర్పించారు. భావ వ్యక్తీకరణను కళ్ల ముందు ఆవిష్కరించారు. కాన్వాస్‌ మీద 'అమ్మ'కు రూపమిచ్చి, అమ్మ మనసుకు రంగులద్ది మురిసిపోయారు. అవార్డులందుకున్నారు. మానస ప్రియ అనే చిత్రకారిణి చిత్రకళలో ఓ భిన్నమైన ప్రయోగం చేశారు. ఆమె దృశ్యాల్లో అమ్మ ఒకరూపంగా కనిపించదు. అమ్మ మనసు కనిపిస్తుంది. అమ్మ తన బిడ్డను ఇష్టంగా చూసుకునే భంగిమలు ఈ చిత్రాల్లో అమ్మ మనసును ఆవిష్కరిస్తాయి. ఆ 'చిత్ర'మైన బొమ్మలను చూద్దాం.


బెంగళూరులో కర్నాటక చిత్రకళా పరషత్‌లో ఇరవై రోజుల కిందట ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ పెట్టారు ధూళిపాళ్ల మానస ప్రియ. సోలో ఎగ్జిబిషన్‌లో ఉన్నది మొత్తం పద్నాలుగు చిత్రాలు. నిలువెత్తున ఉన్న ఈ చిత్రాలను వీక్షకులు తలెత్తి చూశారు.


అద్భుతమైన ఆవిష్కరణలకు ప్రశంసల వర్షం కురిపించారు. ఇరవై ఏళ్ల కిందట హైదరాబాద్‌లో ఫైన్‌ ఆర్ట్స్, ఆ తర్వాత బెంగళూరులో విజువల్‌ ఆర్ట్స్‌ చేసిన మానస కుటుంబం కోసం గృహిణిగా ఉండిపోయారు.


ఈ ఎగ్జిబిషన్‌ ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్‌. చిత్రకారిణిలోని తల్లి మనసును ప్రతిబింబించాయి ఈ చిత్రాలు. నిద్రపోతున్న పాపాయి ముఖంలో ఉండే స్వచ్ఛత సృష్టిలో మరెక్కడా చూడలేం. బిడ్డ ముఖంలో ఉండే ఆ స్వచ్ఛత తల్లి మనసును ఆనందంతో ముంచెత్తుతుంది.


ఆ అందమైన భావానికి రూపమివ్వాలనుకున్నారామె. ఒక ఫైన్‌ ఆర్ట్స్‌ స్టూడెంట్‌ తాను నేర్చుకున్న కోర్సును యథాతథంగా కొనసాగించడంతో ఆగిపోరాదనేది ఆమె అభిప్రాయం. తన వంతుగా కళకు మరికొన్ని సొబగులు అద్దాలి. సాధ్యమైతే మరో కొత్త మాధ్యమాన్ని పొందుపరచగలగాలి. తాను చేసిన ఈ ఊలు చిత్రాల ప్రయోగం తప్పకుండా కొత్త ఆవిష్కరణ అన్నారామె.

Tags:    
Advertisement

Similar News