ఆపరేషన్ మొదలు పెడ్తాం...మెజారిటీ రాకున్నా అధికారంలోకి వస్తాం... కర్ణాటక బీజేపీ నేత సంచలన ప్రకటన‌

“ఎలాంటి సందేహం లేకుండా కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. మేము మెజారిటీతో గెలుస్తాము, మెజార్టీ రాకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. మేము హైకమాండ్ నుండి మార్గదర్శకత్వం తీసుకుంటాము. మాకు మెజారిటీ రాకపోతే, హైకమాండ్ మార్గదర్శకత్వంతో మా కార్యాచరణ ప్రారంభిస్తాం” అని బీజేపీ నేత అశోక‌ అన్నారు.

Advertisement
Update:2023-05-12 10:54 IST
ఆపరేషన్ మొదలు పెడ్తాం...మెజారిటీ రాకున్నా అధికారంలోకి వస్తాం... కర్ణాటక బీజేపీ నేత సంచలన ప్రకటన‌
  • whatsapp icon

తమ పార్టీకి మెజారిటీ రాకపోతే, హైకమాండ్ మార్గదర్శకత్వంతో బిజెపి ‘ఆపరేషన్’ ప్రారంభిస్తుందని కర్నాటక రెవెన్యూ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ఆర్ అశోక అన్నారు. కన్నడ న్యూస్ ఛానల్ 'న్యూస్ ఫస్ట్'తో మాట్లాడుతూ ఆయన‌ మెజారిటీ రాకపోయినా సరే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఒక వేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీపార్టీ కార్యాచరణ ఏమిటని అశోకని న్యూస్ ఫస్ట్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు “మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఎలా, ఎప్పుడు అని అడగవద్దు. ఏం చేయాలో ప్లాన్ బి గురించి మా కేంద్ర, రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నాం.'' అని అన్నారు.

“ఈ సంవత్సరం, మేము కప్ గెలవబోతున్నాము. హైకమాండ్ మద్దతుతో ట్రోఫీని అందుకొని విజేతలుగా నిలుస్తాం. ఎలాంటి సందేహం లేకుండా కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది. మేము మెజారిటీతో గెలుస్తాము, మెజార్టీ రాకపోతే ఏం చేయాలో మాకు తెలుసు. మేము హైకమాండ్ నుండి మార్గదర్శకత్వం తీసుకుంటాము. మాకు మెజారిటీ రాకపోతే, హైకమాండ్ మార్గదర్శకత్వంతో మా కార్యాచరణ ప్రారంభిస్తాం” అని ఆయన అన్నారు.

వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌ అశోక నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీ లేదా కూటమి 112 మార్కును దాటాలి. 2018లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 78 సీట్లు, జేడీ(ఎస్) 37 సీట్లు గెలుచుకున్నాయి. 2019లో ఉప ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో బీజేపీ సంఖ్య 120కి పెరిగింది. ఆ మేరకు కాంగ్రెస్, జేడీఎస్ ల బలం తగ్గింది.

ఈసారి అధికార బీజేపీ వైఫల్యాలపైనే కాంగ్రెస్ ప్రచారం కేంద్రీకృతమైంది. ప్రధానమంత్రి వ్యక్తిత్వం. ‘డబుల్ ఇంజన్ ప్ర‌భుత్వ‍ం' అనే నినాదం ద్వారా బిజెపి కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ప్రయత్నించింది.

చాలా ఎగ్జిట్ పోల్స్ కర్ణాటకలో హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా, రెండు ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి.

Tags:    
Advertisement

Similar News