వలస కార్మికులకు రేషన్ కార్డులివ్వడంలో ఎందుకీ నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలపై సుప్రీం కోర్టు ఆగ్రహం
Advertisement
వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వడంలో ఎందుకింత నిర్లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కరోనా విపత్తుతో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు వారికి కోటాతో సంబంధం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ - శ్రమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని 2021లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఇప్పటికే పలుమార్లు సూచించామని, తమ ఓపికకు హద్దు ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. నవంబర్ 19వ తేదీలోగా రేషన్ కార్డుల జారీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిగిన చర్యలు తీసుకోకుంటే ఆయా శాఖల కార్యదర్శులు విచారణకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Advertisement