స్థిరమైన అభివృద్ధి కోసం భారత్‌తో కలిసి పనిచేస్తాం

'అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు' అనే కార్యక్రమంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ వ్యాఖ్యలు

Advertisement
Update:2024-12-18 08:15 IST

సరిహద్దు గస్తీ విషయంలో ఒప్పందం అనంతరం భారత్‌-చైనాల మధ్య దౌత్య సంబంధాలు పురోగతి చెందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరుదేశాలు ద్వైపాక్షిక సంబంధాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తామని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. 'అంతర్జాతీయ పరిస్థితులు చైనా విదేశాంగ సంబంధాలు' అనే కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రష్యాలో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఇరు దేశాల సంబంధాల మెరుగుదలకు ముఖ్యమైన ప్రతిపాదన సమర్పించినట్లు వాంగ్‌ యీ వెల్లడించారు. దీనికి మోదీ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఇరు దేశాలు అభివృద్ధి చెందడానికి ఢిల్లీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆసియా దేశాలతో స్వేచ్ఛ, వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం అని అని తెలిపారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ బుధవారం చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు ప్రాంతంలో శాంతిపై వాంగ్‌ యూ, అజిత్‌ దోవల్‌ చర్చిస్తారు.

ఇటీలవ పార్లమెంటు ఉభయ సభల్లో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ భారత్-చైనా సంబంధాలపై మాట్లాడుతూ.. చైనా చర్యల వల్ల 2020లో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు భంగం వాటిల్లిందన్నారు. అప్పటి నుంచి ఇరు దేశౄల మద్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. లాజిస్టికల్‌ సవాళ్లు, కొవిడ్‌ పరిస్థితులు ఉన్నప్పటికీ మన బలగాలు చైనాను కట్టడి చేశాయన్నారు. అయితే నిరంతర దౌత్య చర్చల ఫలితంగా ఇరు దేశాల మద్య సంబంధాల్లో ఇటీవల కొంత మెరుగుదల కనిపించిందని వివరించారు. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గించడానికి పొరుగు దేశంతో దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News