కులదేవత అనుకుని డైనోసర్ గుడ్లకు పూజలు.. ఎక్కడంటే..?

తాజాగా ఈ పార్కు అభివృద్ధి పనుల పరిశీలన కోసం శాస్త్రవేత్తల బృందం పడ్లియా గ్రామాన్ని సందర్శించింది. అక్కడ గ్రామస్తులతో వర్క్ షాప్ నిర్వహించింది.

Advertisement
Update:2023-12-22 22:05 IST

గుండ్రటి రాళ్లను కుల దేవతగా భావించి డైనోసర్ గుడ్లకు తరతరాలుగా ఆ ఊరి ప్రజలు పూజలు చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. చివరికి గుండ్రంగా ఉన్న రాళ్లు కుల దేవత కాదని.. అవి డైనోసర్ గుడ్ల శిలాజాలని శాస్త్రవేత్తల బృందం తేల్చడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గతంలో డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే కొన్ని వందల డైనోసార్ గుడ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. 2011లో ధార్ జిల్లాలోని పడ్లియా గ్రామంలో డైనోసార్ శిలాజాల జాతీయ పార్కు కూడా ఏర్పాటు చేశారు.

కాగా, తాజాగా ఈ పార్కు అభివృద్ధి పనుల పరిశీలన కోసం శాస్త్రవేత్తల బృందం పడ్లియా గ్రామాన్ని సందర్శించింది. అక్కడ గ్రామస్తులతో వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డైనోసర్ గుడ్ల శిలాజాలు గుండ్రంగా ఉంటాయంటూ వాటి గురించి వివరించారు. అటువంటి గుండ్రటి ఆకారాలను కుల దేవతగా భావించి తాము పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు శాస్త్రవేత్తల దృష్టికి తెచ్చారు.

దీంతో ఆ గుండ్రటి రాళ్ళను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అవి కుల దేవత రూపం కాదని.. డైనోసర్ శిలాజాలు అని వారు నిర్ధారించారు. ఆ విషయం తెలియక తాము తరతరాలుగా డైనోసర్ గుడ్లకు పూజలు చేస్తున్నామని తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పడ్లియా గ్రామం ఉన్న ప్రాంతం నర్మదా వ్యాలీ ప్రాంతంలో లక్షల సంవత్సరాల క్రితం డైనోసర్లు జీవించి ఉన్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు.

Tags:    
Advertisement

Similar News