పార్టీ పేరు, గుర్తు కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఉద్ధవ్

పార్ట పేరు, విల్లంబు-బాణం గుర్తుని షిండే వర్గానికి కేటాయించింది ఈసీ. దీనిపై వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఉద్ధవ్ థాక్రే.

Advertisement
Update:2023-02-20 13:05 IST

ఇల్లు అలకగానే పండగ కాదు అంటున్నారు ఉద్ధవ్ థాక్రే. శివసేన పేరు, పార్టీ గుర్తు షిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అదే సమయంలో ఆ నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఉద్ధవ్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశముంది.

శివసేనకు ఉన్న 57మంది ఎమ్మెల్యేలలో ఉద్ధవ్ వర్గం కేవలం 17. మిగతా 40మంది ఏక్ నాథ్ షిండేతో ఉన్నారు. అందుకే నిర్ణయాలన్నీ ఆయనకు అనుకూలంగా వస్తున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నా, అంతకు ముందే స్పీకర్ ని షిండే వర్గం దించేయాలని చూడటంతో ఆ వ్యవహారం కూడా సుప్రీంలోనే ఉంది. ఇక శివసేన పార్టీ పేరు, గుర్తు విషయంలో  , ఇటీవలే షిండే వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్ట పేరు, విల్లంబు-బాణం గుర్తుని షిండే వర్గానికి కేటాయించింది. దీనిపై వాదోపవాదాలు మొదలయ్యాయి. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఉద్ధవ్ థాక్రే.

మరోవైపు శివసేన పేరు, గుర్తు కేటాయింపు విషయంలో ఈసీ అమ్ముడుపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. 2వేల కోట్ల రూపాయలు ఈ వ్యవహారంలో చేతులు మారాయన్నారు. దీనిపై పక్కా ఆధారాలున్నాయని చెబుతున్నారాయన. ఈ వాదనను షిండే వర్గం ఖండించింది. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ సంజయ్ రౌత్ పై మండిపడ్డారు షిండే వర్గం నేతలు. పార్టీ పేరు, గుర్తు కేటాయింపుతో సత్యం గెలిచిందంటూ సీఎం షిండే ప్రకటించారు. ఇప్పుడు వ్యవహారం సుప్రీం వరకు చేరడంతో తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా వస్తుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News