లింకులు పోలేదు.. మోదీని వెంటాడుతున్న డాక్యుమెంటరీ

నిజానిజాలు చెబుతున్నవారి గొంతునొక్కాలని చూడటం బీజేపీ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని అంటున్నాయి ప్రతిపక్షాలు. దేశంలో ఇప్పటికే చాలామందిని తమ దారికి తెచ్చుకున్నారని, కానీ బీబీసీ విషయంలో అది సాధ్యం కాదని తేలిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-01-23 08:06 IST

ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ, కేంద్రంలోని బీజేపీ సర్కారుకి పీడకలగా మారింది. మెలకువలో ఉన్నా, నిద్రలో ఉన్నా మోదీకి ‘‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’’ అనేదే గుర్తుకొస్తోంది. సహజంగా ఇలాంటి వ్యవహారాల్లో మోదీ సర్కారు కాస్త కఠినంగానే ఉంటుంది. గతంలో ఎన్నో జాతీయ మీడియా సంస్థల నోళ్లు మూయించారు, యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించారు. కానీ ఇక్కడ డాక్యుమెంటరీ ప్రసారకర్త బీబీసీ కావడంతో జాతీయవాదం పేరు చెప్పి బీజేపీ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఆ డాక్యుమెంటరీ ప్రజల కంటపడకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో లింకులన్నీ తొలగించాలని యూట్యూబ్, ఫేస్ బుక్, టిట్టర్లకు లేఖలు రాశారు.

పాపం ఎక్కడికీ పోదు..

కేంద్రం చొరవతో దాదాపుగా సోషల్ మీడియా నుంచి ఆ లింకులన్నీ తొలిగించారు. అయితే ఆ పాపం ఎక్కడికీ పోదంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోషల్ మీడియా లింగులను వెదికి మరీ తెరపైకి తెచ్చారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, డెరెక్‌ ఓ బ్రియెన్‌, బీబీసీ డాక్యుమెంటరీ లింకులను తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేశారు. ప్రభుత్వ సెన్సార్‌ షిప్‌ కి వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. అయితే వారు షేర్ చేసిన లింకుల్ని కూడా తొలగించడంతో.. ఆ తర్వాత మరిన్ని లింకుల్ని వెదికి మరీ పోస్ట్ చేశారు. మోదీపై తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.


టార్గెట్ మోదీ..

నిజానిజాలు చెబుతున్నవారి గొంతునొక్కాలని చూడటం బీజేపీ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని అంటున్నాయి ప్రతిపక్షాలు. దేశంలో ఇప్పటికే చాలామందిని తమ దారికి తెచ్చుకున్నారని, కానీ బీబీసీ విషయంలో అది సాధ్యం కాదని తేలిపోయిందని కామెంట్ చేస్తున్నారు. మోదీ తప్పు చేయకపోతే తలదించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, సోషల్ మీడియా లింకులు తొలగించినంత మాత్రాన మోదీ నిజాయితీపరుడు అయిపోడని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. అక్కడితో ఆగకుండా బీబీసీ డాక్యుమెంటరీ లింకులు షేర్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News