మోడీ పుట్టిన రోజు నాడే కొత్త పార్లమెంట్‌లోకి ఎంట్రీ..!
సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ జాతీయ జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అదే రోజు మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.
కొత్త పార్లమెంట్‌లో సమావేశాలకు అంతా రెడీ చేస్తున్నారు అధికారులు. ప్రారంభానికి గుర్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు రోజు.. సెప్టెంబర్ 17న కొత్త పార్లమెంట్ ముందు జాతీయ జెండా ఎగరేయనున్నారు ప్రధాని మోడీ. విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే అదే రోజు మోడీ పుట్టిన రోజు కూడా కావడం యాధృచ్చికం.
ఈనెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఐదు రోజుల్లో మొదటి రోజు సమావేశాలను పాత బిల్డింగ్‌లో నిర్వహించి.. మిగతా నాలుగు రోజుల సమావేశాలు కొత్త పార్లమెంట్‌లో నిర్వహించాలనేది ప్లాన్. ఈ ఏడాది మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించగా.. ఆ బిల్డింగ్‌లో ఇవే మొదటి సమావేశాలు కానున్నాయి. ఇక కొత్త భవనాన్ని నిర్మించిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్.. సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ జాతీయ జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అదే రోజు మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. ఇక ఇప్పటివరకూ నూతన పార్లమెంట్ వద్ద జాతీయ జెండా ఎగరేయలేదు.
ఇక స్పెషల్ సెషన్‌కు టైం దగ్గరపడుతుండటంతో మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు కొత్త పార్లమెంట్‌ను పరిశీలించారు. రాజ్యసభలో ఆడియో లెవల్స్, ఎంపీల మల్టీమీడియా సిస్టమ్స్‌ను తనిఖీ చేశారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.