భారత్ జోడో యాత్రలో విషాదం...ఎంపీ హటాత్మరణం

పంజాబ్ లో యాత్ర సాగుతుండగా రాహుల్ తో పాటు నడుస్తున్న జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటు తో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఫగ్వారా సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే ఆయన మరణించారు.

Advertisement
Update:2023-01-14 12:39 IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం సంభవించింది. పంజాబ్ లో యాత్ర సాగుతుండగా రాహుల్ తో పాటు నడుస్తున్న జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటు తో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఫగ్వారా సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే ఆయన మరణించారు. సంతోఖ్ సింగ్ వయసు 76 ఏళ్ళు.

సంతోఖ్ సింగ్ మరణించిన విషయం తెలియగానే రాహుల్ గాంధీ యాత్ర నిలిపివేసి ఆస్పత్రికి వెళ్ళారు.

“జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ, 76 ఏళ్ల సంతోఖ్ సింగ్ చౌదరి ఈ ఉదయం భారత్ జోడో యాత్రలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం" అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్‌లో తెలిపారు. "

అనంతరం రమేష్ మాట్లాడుతూ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు తెలిపారు.

చౌదరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇది పార్టీకి, సంస్థకు తీరని లోటు అని అన్నారు.

Tags:    
Advertisement

Similar News