తమిళనాడు ప్రజలు తన గొప్పతనాన్ని గుర్తించలేదని తమిళిసై ఆవేదన‌

తమిళనాడు ప్ర‌జలు తనను పార్లమెంటుకు ఎన్నుకొని ఉంటే తాను కేంద్ర మంత్రిని అయ్యేదాన్నని, తమిళనాడు ప్రజలు దయచేసి మంచి వ్యక్తులను గుర్తించండి. మాలాంటి వాళ్లకు మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించండి అని ఆమె అన్నారు.

Advertisement
Update:2023-02-21 12:22 IST

తమిళనాడు ప్రజలు తన గొప్పతనాన్ని గుర్తించలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోయంబత్తూరులోని పీళమేడు ప్రాంతంలో ప్రైవేటు కళాశాల ప్రాంగణంలో ఏర్పాటైన సభలో ఆమె ప్రసంగిస్తూ.. ప్రతిభావంతులను తమిళనాడు ప్రజలు గుర్తించడం లేదని అన్నారు.

తమిళనాడు ప్ర‌జలు తనను పార్లమెంటుకు ఎన్నుకొని ఉంటే తాను కేంద్ర మంత్రిని అయ్యేదాన్నని, తమిళనాడు ప్రజలు దయచేసి మంచి వ్యక్తులను గుర్తించండి. మాలాంటి వాళ్లకు మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించండి అని ఆమె అన్నారు.

“మా లాంటి ప్రతిభావంతులను ప్రధానమంత్రి , హోంమంత్రులు గుర్తించి రాష్ట్రాలకు గవర్నర్ లుగా నియమించారు, కానీ స్వంత రాష్ట్రమైన‌ తమిళనాడు ప్రజలు మాత్రం పార్లమెంటు సభ్యులుగా చేయలేకపోయారు అన్నారామె.

తమిళనాడులో శాంతిభద్రతల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నపై స్పందించిన తమిళిసై ఆ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని అడగండి. నేను గవర్నర్‌గా ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించలేను' అని అన్నారు.

Tags:    
Advertisement

Similar News