తమిళనాడు వ్యాప్తంగా నేటి నుంచి కేరళస్టోరీ నిలిపివేత
ఒక వైపు థియేటర్ల ముందు నిరసనలు, మరో వైపు ప్రజలనుండి ఈ మూవీకి స్పందన కరువవడంతో ఈ మూవీ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలోంచి తీసేయాలనీ నిర్ణయించారు. మల్టిప్లెక్స్ థియేటర్లలో నిన్నటి నుంచే ఆగిపోగా,ఈ రోజు నుంచి పూర్తిగా అన్ని థియేటర్లలోంచి మూవీ ఆగిపోయింది.
అనేక నిరసనలకు కారణమైన వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ' తమిళనాడులో నిలిపివేశారు. ఈ రోజు నుంచి తమిళనాడులోని ఏ థియేటర్లో కూడా కేరళ స్టోరీ మూవీని ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులు నిర్ణయం తీసుకున్నారు.
అబద్దాల ప్రచారంతో ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ది కోసం ఆరెస్సెస్, బీజేపీలే ఈ మూవీ నిర్మించాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ మూవీని నిలిపివేయాలనే డిమాండ్ తో తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఒక వైపు థియేటర్ల ముందు నిరసనలు, మరో వైపు ప్రజలనుండి ఈ మూవీకి స్పందన కరువవడంతో ఈ మూవీ ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్లలోంచి తీసేయాలనీ నిర్ణయించారు. మల్టిప్లెక్స్ థియేటర్లలో నిన్నటి నుంచే ఆగిపోగా ఈ రోజు నుంచి పూర్తిగా అన్ని థియేటర్లలోంచి మూవీ ఆగిపోయింది.
కాగా, తమిళనాడులో అన్ని థియేటర్లలో 'ది కేరళ మూవీ' నిలిపివేయడం పట్ల నామ్ తమిళార్ కట్చి(NTK) పార్టీ అధ్యక్షుడు సీమాన్ హర్షం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నాయకురాలు కుష్బు మాత్రం మూవీ ఆపేయడాన్ని ఖండించారు. ఆ మూవీను చూడాలో వద్దో తేల్చుకోవల్సింది ప్రేక్షకులే కానీ థియేటర్ యజమానులో, ప్రభుత్వమో, నిరసనకారులో కాదని ఆమె అన్నారు.