సీమా బన్‌గయా.. హీరోయిన్
పబ్జీ ప్రేమికుడిని కలిసేందుకు పాక్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన సీమా హైదర్ జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. సచిన్ మీనా, సీమా హైదర్ కుటుంబాన్ని కలిసిన చిత్రబృందం.. వారి కథపై సినిమా తీసే విషయమై చర్చలు జరిపింది.
పబ్జీ ఆడుతూ పరిచయమైన వ్యక్తి కోసం పాక్ నుంచి భారత్‌కు పయనమైన సీమా హైదర్ సెలబ్రెటీ అయిపోయింది. ఆమెకు వచ్చిన పాపులారిటీని అందిపుచ్చుకునేందుకు సినిమా నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పుడు సీమ ప్రేమకథ, జీవిత కథ సినిమాగా రానుంది. ఇప్పటికే ఒక సినిమా చర్చల దశలో ఉండగా... ఇప్పుడు మరో సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. సీమా ఆడిషన్ కూడా పూర్తయింది. ఇక ఆ ప్రేమకథను తెరకెక్కడం... దానిని మనం చూడడమే మిగిలింది.
పబ్జీ ప్రేమికుడిని కలిసేందుకు పాక్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన సీమా హైదర్ జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. సచిన్ మీనా, సీమా హైదర్ కుటుంబాన్ని కలిసిన చిత్రబృందం.. వారి కథపై సినిమా తీసే విషయమై చర్చలు జరిపింది. సినిమాకు పేరును కూడా టీం ఖరారు చేసింది. మాజీ భర్తతో ఆమె ఎలా ఉండేది. సచిన్, సీమా ప్రేమ కథ ఎలా మొదలైందన్న నేపథ్యంలో సినిమా నిర్మాణం జరగనుంది. పబ్జీ ప్రియుడి కోసం పాక్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాత అమిత్ జానీ వెల్లడించారు. పబ్జీ గేమ్ ఆడుతుండగా ప్రేమకథ ఎలా మొదలైంది. ఆమె భారత్‌కు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? సీమా.. పాక్ ఏజెంటా? కాదా ? అనేది ప్రపంచానికి చెప్పాలని అనుకుంటున్నట్లు నిర్మాత వివరించారు. చిత్రానికి కరాచీ టు నోయిడా అనే పేరు ఖరారు చేశారు. ఆమె కరాచీ నుంచి నేపాల్ మీదుగా నలుగురు పిల్లలతో కలిసి నొయిడాకు వచ్చిందన్న అర్థంలో ఈ పేరు పెట్టారు.
సీమా గురించి సమాచారం తెలుసుకోవడానికి ఆమె మాజీ భర్త గులాం హైదర్‌ను సంప్రదించాలని అనుకున్నామనీ.. గులాం భారత్‌కు రాకపోతే ఆయన ఉంటున్న సౌదీ అరేబియాకు రచయితను పంపిస్తామని నిర్మాత చెప్పారు. మరోవైపు.. ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటనపై తెరకెక్కించనున్న ఏ టైలర్ మర్డర్ స్టోరీ సినిమాలో.. నటించాలని సీమాను చిత్రబృందం ఇప్పటికే సంప్రదించింది. ఆ చిత్రంలో రా ఏజెంట్ పాత్రలో సీమా నటించాలని కోరింది. సీమా పబ్జీ ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు నలుగురు పిల్లలతో సహా పాక్‌ను విడిచి భారత్‌కు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె పాక్ ఏజెంట్ అన్న అనుమానాలు వెల్లువెత్తాయి. కొందరు ఆమె ప్రేమకు మద్దతు పలకగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు.