ప్రియాంకా గాంధీకి అదే పెద్ద సవాల్‌

ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ

Advertisement
Update:2024-11-11 17:46 IST

వయనాడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి, తన సోదరి ప్రియాంక గాంధీ ముందు పెను సవాల్‌ ఉందని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ అన్నారు. వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సోమవారం ప్రియాంక తరపున నిర్వహించిన ప్రచార సభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాలకతీతంగా వయనాడ్ కు నా హృదయంలో స్థానం ఉంటుంది.. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి రెడీగా ఉన్న.. ఈ ప్రాంత అందాలను ప్రపంచానికి చూపించాలి.. ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.. రాబోయే రోజుల్లో ప్రియాంక ముందున్న పెద్ద సవాల్‌ ఇదే.. ఎవరైనా కేరళకు వస్తే మొదట వయనాడ్‌ నే సందర్శించాలి అన్నట్టుగా అభివృద్ధి చేయాలి.. కాబేయే ఎంపీగా ఈ చాలెంజ్‌ తీసుకోవాలి.. ఈ ప్రాంతానికి మంచి జరిగితే అది తనకెంతో సంతోషాన్నిస్తుంది'' అన్నారు. 

సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌ తో పాటు ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి రాహుల్‌ గాంధీ విజయం సాధించారు. వయనాడ్‌ సీటుకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాహుల్‌ గాంధీ 2019లో వయనాడ్‌ తో పాటు ఉత్తరప్రదేశ్‌ లోని అమేథిలో పోటీ చేశారు. వాయనాడ్‌ లో గెలిచినా అమేథిలో బీజేపీ ముఖ్యనేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు రాయ్‌ బరేలీ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సోనియగాంధీ విజయం సాధించారు. అనారోగ్యం, ఇతర కారణాలతో సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు. గతంలో అమేథితో తో పాటు రాయ్‌బరేలీ స్థానాల నుంచి నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిథ్యం వహించేవారు. ఇకపై రాయ్‌బరేలీతో పాటు వయనాడ్‌ నుంచి పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ అమేథి నుంచి ఓడిపోయిన ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అక్కడ ఘన విజయం సాధించింది.


Tags:    
Advertisement

Similar News