పార్టీ అగ్రనేతలు నాపట్ల పక్షపాతం చూపిస్తున్నారు ... కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్

కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్న‌ శశి థరూర్ ఆ పార్టీ నాయకత్వంపై ఆరోపణలకు దిగారు. తన పట్ల పక్షపాతం చూయిస్తున్నారని విమర్శించారు. ఖర్గేకు మద్దతుగా పలువురు రాష్ట్ర అధ్యక్షులు, పీసీసీ నాయకులు వస్తున్నారని, అయితే తాను వెళ్ళినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయన‌ ఆరోపించారు.

Advertisement
Update:2022-10-13 16:20 IST

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ లు తమ ప్రచారాన్ని తీవ్రతరం చేశారు.

కాగా, పార్టీలో తన పట్ల పక్షపాతం చూపిస్తున్నారని శశిథరూర్ ఈ రోజు ఆరోపించారు. ఖర్గేకు మద్దతుగా పలువురు రాష్ట్ర అధ్యక్షులు, పీసీసీ నాయకులు వస్తున్నారని, అయితే తాను వెళ్ళినప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు.

మరో వైపు ఎన్నికల అథారిటీ హెడ్‌ మధుసూధన్‌ మిస్త్రీ మాట్లాడుతూ.. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని చెప్పారు. కార్యకర్తలు ఓట్లు వేసేటప్పుడు భయపడవద్దని అన్నారు.

"ఎక్కడ‌ ఎవరు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ తెలియదు," అని చెప్పిన మిస్త్రీ పోటీలో ఉన్న ఒక అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఫీలర్‌లు అందాయన్న విషయం ఉట్టి పుకార్లే అని కొట్టిపారేశారు.

అయితే తాను మిస్త్రీ ని తప్పుపట్టడం లేదని, దీనికి అగ్రనాయకత్వమే కారణమని థరూర్ అన్నారు. వ్యవస్థలోనే లోపాలున్నాయని ఆయన అభ్ప్రాయపడ్డారు. 22 ఏళ్ళుగా పార్టీ అంతర్గత ఎన్నికలు జరగకపోవడం కూడా దీనికి ఒక కారణమని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News