శంభు సరిహద్దు వద్ద టెన్షన్

పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్‌ రైతుల 'ఢిల్లీ చలో' కార్యక్రమం

Advertisement
Update:2024-12-06 16:04 IST

పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. హర్యానా, పంజాబ్‌ రైతులు చేపట్టిన 'ఢిల్లీ చలో' కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సంయుక్త కిసాన్‌ మోర్చ నేతృత్వంలో వందలాదిమంది రైతులు శంభు సరిహద్దు గుండా రాజధానిలోకి ప్రవేశించడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బారికేడ్లను దాటుకొని రైతులు ఢిల్లీ వైపు కదలడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కనీస మద్దతు ధరపై పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. మోడీ గ్యారెంటీని కచ్చితంగా అమలుచేసి తీరుతామన్నారు. ఉత్పత్తి ధర కంటే కనీసం 50 శాతం అధికంగా చెల్లించి పంటను కొనుగోలు చేయాలన్న ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేమని గతంలో కాంగ్రెస్‌ చెప్పిందని చౌహాన్‌ సభకు వివరించారు. కానీ, మోదీ ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం, గోధుమలు, సోయాబీన్‌, జొన్న పంటలకు ఉత్పత్తి ధర కంటే 50 శాతం అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నదని వివరించారు. 

Tags:    
Advertisement

Similar News