టీమిండియా నంబర్‌-1.. అన్ని ఫార్మాట్లలో మనదే జోరు..!

గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించ‌డంతో టీ-20ల్లోనూ ఫస్ట్ ప్లేసులో కొనసాగుతోంది.

Advertisement
Update:2023-09-23 07:55 IST

వరల్డ్‌కప్‌ సమీపిస్తున్న వేళ.. టీమిండియా ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఇటీవల ఆసియా కప్‌ గెలిచి జోరు మీదున్న భారత్‌.. తాజాగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వ‌న్డే మ్యాచులోనూ విజయం సాధించింది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేసుకు చేరుకుంది. ప్రస్తుతం ఇండియా 116 పాయింట్లతో అగ్రస్థానం సాధించగా.. పాకిస్థాన్-115, ఆస్ట్రేలియా -111 వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక ఇప్పటికే టెస్టు, టీ-20 ఫార్మాట్ల‌లో టాప్‌ ప్లేసులో ఉంది టీమిండియా. ఆసీస్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ గెలవడం, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరడం.. విండీస్‌తో టెస్టు సిరీస్‌ నెగ్గడంతో 118 పాయింట్లతో టెస్టుల్లోనూ టాప్‌ ప్లేసును సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా-118, ఇంగ్లండ్‌ - 115 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించ‌డంతో టీ-20ల్లోనూ ఫస్ట్ ప్లేసులో కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్‌ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 టీ-20 సిరీస్‌లు ఆడిన టీమిండియా.. ఒక్క సిరీస్‌ను మాత్రమే చేజార్చుకుంది. దీంతో భారత్ ఖాతాలో 264 పాయింట్లు చేరాయి. టీ-20ల్లోనూ భారత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్, పాకిస్థాన్‌ టాప్‌-3లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News