రివాల్వ‌ర్‌తో కాల్చుకొని కోయంబ‌త్తూర్ డీఐజీ ఆత్మ‌హ‌త్య‌

కోయంబ‌త్తూర్‌లోని రెడ్ ఫీల్డ్స్‌లో గ‌ల క్వార్ట‌ర్స్‌లో ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

Advertisement
Update:2023-07-07 10:56 IST

తమిళనాడుకు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు శుక్ర‌వారం ఆత్మహత్య చేసుకున్నారు. డీఐజీ ర్యాంకుకు చెందిన ఆయన ఉద‌యం వేళ 6 గంట‌ల స‌మ‌యంలో తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నారు. త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తోనే కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేత‌వ‌సుకున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. కోయంబ‌త్తూర్ స‌ర్కిల్‌లో డీఐజీ హోదాలో ప‌నిచేస్తున్న ఆ అధికారి సి.విజ‌య్‌కుమార్‌.

కోయంబ‌త్తూర్‌లోని రెడ్ ఫీల్డ్స్‌లో గ‌ల క్వార్ట‌ర్స్‌లో ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి నివాసం ఉంటున్నారు. తీవ్ర ఒత్తిడే ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం ఆయ‌న మృత‌దేహాన్ని కోయంబ‌త్తూర్ మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. విజయ్ కుమార్ ఈ ఏడాది జనవరి నుంచి డీఐజీ హోదాలో విధులు నిర్వ‌హిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News