స్విగ్గీ ఐపీవో.. త్వరలో మార్కెట్‌లోకి
ఐపీవో ద్వారా సుమారు రూ. 10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్న సంస్థ
Advertisement
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తొలి పబ్లిక్ ఆఫర్ త్వరలో ప్రారంభం కానున్నది. సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక.. ఎప్పుడెప్పుడు మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తుందని మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని సబ్ స్క్రిప్షన్ నవంబర్ 5 నుంచి ప్రారంభకాబోతున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఐపీవో ద్వారా సుమారు రూ. 10 వేల కోట్లు సమీకరించాలని స్విగ్గీ భావిస్తున్నది. తాజా షేర్ల జారీతో రూ. 3,750 కోట్లు, 182,286,265 షేర్లను ఆఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 750 కోట్లు సమీకరించాలని చూస్తున్నది. సబ్‌స్క్రిప్షన్‌లు నవంబర్ 8న ముగియనున్నట్లు తెలుస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఒకరోజు ముందే ఇదిమొదలుకానున్నది. ధరల శ్రేణి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉన్నది.
Advertisement