నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 300 పాయింట్లు.. నిఫ్టీ 94 పాయింట్లు లాస్
Advertisement
దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ప్రారంభాన్ని నష్టాల్లోనే ఆరంభించాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడింగ్ నష్టాల్లోనే మొదలైంది. సెన్సెక్స్ 318 పాయింట్లు కోల్పోయి 75,633 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయి 22,834 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్ర అండ్ మహీంద్ర నష్టాల్లో కొనసాగుతుండగా సిప్లా, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
Advertisement