బిజెపి ప్ర‌భుత్వం అక్క‌సు ..జోడో యాత్ర‌లో పాల్గొన్న టీచ‌ర్ స‌స్పెన్ష‌న్‌..!

గ‌త నెల 24న కనస్య జిల్లాలో రాహుల్ గాంధీ కొన‌సాగించిన యాత్ర‌లో రాజేష్ క‌న్నోజీ అనే టీచ‌ర్ పాల్గొని ఆయ‌న వేసిన పెయింటింగ్స్ రాహుల్ గాంధీకి బ‌హుక‌రించారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌డంతో ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్ళాయి.

Advertisement
Update:2022-12-04 12:46 IST

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ నిర్వ‌హిస్తున్న భార‌త్య జోడో యాత్ర విజ‌య‌వంతంగా సాగుతుండ‌డంతో బిజెపిలో రోజు రోజుకీ పెరుగుతున్న‌ అస‌హ‌నం, అక్క‌సు బ‌య‌ట‌ప‌డుతోంది. ఈ యాత్ర ప్రారంభం నుంచీ రాహుల్ ధ‌రించిన టీ ష‌ర్ట్ మొద‌లు ప్ర‌తీ చిన్న అంశాన్ని వివాదాస్ప‌దం చేసేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌తో ఏమీ చేయ‌లేక విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతోంది. తాజాగా భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్న ఓ ఉపాధ్యాయుడిని మధ్య‌ ప్ర‌దేశ్ లోని బిజెపి ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది.

గ‌త నెల 24న కనస్య జిల్లాలో రాహుల్ గాంధీ కొన‌సాగించిన యాత్ర‌లో రాజేష్ క‌న్నోజీ అనే టీచ‌ర్ పాల్గొని ఆయ‌న వేసిన పెయింటింగ్స్ రాహుల్ గాంధీకి బ‌హుక‌రించారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వ‌డంతో ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్ళాయి. దీంతో స‌ర్వీస్ కాండ‌క్ట్ రూల్స్ అతిక్ర‌మించారంటూ ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసి అనంత‌రం విధుల నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌ధ్య ప్ర‌దే్శ్ లోని ఆదివాసీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రైమరీ స్కూల్ లో రాజేశ్ కన్నోజి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అత్య‌వ‌స‌ర ప‌ని ఉందంటూ సెల‌వు పెట్టి భార‌త్ జోడో యాత్ర‌లో రాజేష్ పాల్గొన్నాడ‌ని , ఇది కాండ‌క్ట్ రూల్స్ కు విరుద్ధ‌మ‌ని అందుకే స‌స్పెండ్ చేశామ‌ని అధికారులు వివ‌ర‌ణ ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం ప్రొఫెష‌న‌ల్ కాండాక్ట్ రూల్స్ ను ఉల్లంఘించడమేనని, అందుకే రాజేశ్ పై చర్యలు తీసుకున్నామని తెలిపారు.

కాగా, టీచ‌ర్ రాజేష్ సస్పెన్షన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ మధ్య‌ ప్ర‌దేశ్ ప్ర‌బుత్వ తీరును త‌ప్పు బ‌ట్టింది. భారత్ జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా జరుగుతోందని వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొన్నందుకు రాజేశ్ ను సస్పెండ్ చేయడంపై మండిపడింది. రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జోడో యాత్రలో పాల్గొన్నడని రాజేశ్ ను సస్పెండ్ చేయడం అన్యాయమని ఆరోపించింది.

Tags:    
Advertisement

Similar News