గాలి జనార్ధనరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ !

గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన బెయిల్ నిబంధనలు సడలించాలంటూ ఆయ‌న సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.

Advertisement
Update:2022-10-10 14:47 IST

అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ నిబంధనలు సడలించాలంటూ ఆయ‌న సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది.

ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాదు సీబీఐ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇకనుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నిబంద‌న‌ల‌ను స‌వ‌రిస్తూ మ‌రింత కాలం తాను బళ్ళారిలో ఉండే అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతూ జ‌నార్ద‌న‌రెడ్డి పిటిష‌న్ లో కోరారు.

ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్ర‌మ మైనింగ్ కేసులో గాలి జ‌నార్ద‌న్ రెడ్డి పై సిబిఐ ప‌లు అభియోగాలు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News