ఎల‌క్టోర‌ల్ బాండ్లు చ‌ట్ట‌విరుద్ధం.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌పై కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు సీపీఐ(ఎం), ఎన్‌జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిష‌న్లు వేశాయి.

Advertisement
Update:2024-02-15 12:34 IST

దేశంలో రాజ‌కీయ పార్టీలు అధికారికంగా విరాళాలు సేక‌రించాలంటే ఎల‌క్టోర‌ల్ బాండ్స్ మాత్ర‌మే మార్గం. దీని ద్వారానే అన్ని పార్టీలూ విరాళాలు సేక‌రిస్తూ ఉంటాయి. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని సుప్రీంకోర్టు ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని, ఈ స్కీమ్‌ని నిలిపివేయాలని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ చంద్రచూడ్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది.

కాంగ్రెస్ నేత‌లు, ఎన్‌జీవోల పిటిష‌న్లు

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌పై కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్‌తో పాటు సీపీఐ(ఎం), ఎన్‌జీవో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పిటిష‌న్లు వేశాయి. దీనిపై నిరుడు నవంబర్ 2న వాద‌నలు పూర్త‌య్యాయి. అప్ప‌టి నుంచి కోర్టు ఈ తీర్పును వెల్ల‌డించ‌లేదు. తాజాగా ఎల‌క్టోర‌ల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని, వాటిని నిలిపివేయాల‌ని తీర్పు వెలువ‌రించింది.

ఏంటీ ఎల‌క్టోర‌ల్ బాండ్లు?

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను 2018లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం.. ఏ భారత పౌరుడు లేదా వారిచే స్థాపించబడిన సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులు క‌లిసి కూడా వీటిని కొన‌వచ్చు. ఆ కొనుగోలుకు మ‌నం వెచ్చించే డ‌బ్బు ఆ పార్టీ ఆథ‌రైజ్డ్ బ్యాంకు అకౌంట్‌లో ప‌డుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక విరాళాలు పొందుతున్న‌ది బీజేపీ. త‌ర్వాత స్థానాల్లో కాంగ్రెస్ ఇత‌ర పార్టీలున్నాయి.

Tags:    
Advertisement

Similar News