హిమాచల్ సీఎం ఎవరో డిసైడ్ అయ్యింది

హిమాచల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం ఇస్తూ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక తీర్మానాన్ని ఆమోదించిన ఒక రోజు తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది.

Advertisement
Update:2022-12-10 19:55 IST

హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు , ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ అగ్నిహోత్రి నియమితులైనట్లు ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బఘేల్ శనివారం సిమ్లాలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశం తర్వాత తెలిపారు. ఈ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించింది.

ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని బఘెల్ తెలిపారు.

హిమాచల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం ఇస్తూ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక తీర్మానాన్ని ఆమోదించిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) హిమాచల్ ప్రదేశ్ ఇంచార్జి రాజీవ్ శుక్లా, ఇద్దరు పరిశీలకులు బఘేల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని ప్రకటించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీకి సారథ్యం వహించిన సుఖుతో పాటు, మండి ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేర్లను ప్రకటించిన తర్వాత ప్రతిభా సింగ్ మీడియాతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మేము అంగీకరిస్తున్నాము.'' అన్నారు.

"మేము చాలా మంచి ప్రభుత్వాన్ని నడుపుతాము. రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే హాజరుకానున్నారు" అని హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా చెప్పారు.

శుక్రవారం రాత్రి, కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల ముందు ప్రతిభా సింగ్ మద్దతుదారులు, సుఖు మద్దతుదారులు బలప్రదర్శన నిర్వహించారు.

ఇదిలా ఉండగా, తాను ముఖ్యమంత్రి ఏ రేసులోనూ లేనని సుఖ్విందర్ సింగ్ సుఖు మీడియాతో చెప్పారు.

"నేను ఏ పదవికి రేసులో లేను. భవిష్యత్తులో కూడా ఉండను. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నేనెప్పుడూ ఏ పదవి కోసం ఆశపడలేదు'' అని ఆయన అన్నారు.

తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ తనను నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) రాష్ట్ర అధ్యక్షునిగా చేసి, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్‌గా చేసింది."పార్టీ నాకు చాలా ఇచ్చింది. పార్టీ ఆదేశాన్ని పాటించడం నా కర్తవ్యం" అని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News