'అత్యాచారం నిరోధక పాదరక్షలు' : కర్ణాటక విద్యార్థి వినూత్న ఆవిష్క‌ర‌ణ

కర్ణాటక కల్బుర్గిలోని ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్ లో 10 త‌ర‌గ‌తి చ‌దువుతున్న విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్థిని అత్యాచార నిరోధక పాదరక్షలను( యాంటీ రేప్ ఫుట్ వేర్‌) రూపొందించింది. త‌మ‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్న పోకిరిగాళ్ల‌నుంచి త‌మ‌ను తాము రక్షించుకోవడానికి మహిళ‌ల‌కు ఈ పాదరక్ష‌లు ఎంతో సహాయపడుతాయ‌ని ఆ బాలిక తెలిపింది.

Advertisement
Update:2022-12-14 11:21 IST

మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల‌ను అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటాన్ని క‌ర్ణాట‌క‌కు చెందిన ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్ధిని మ‌రో అడుగు ముందుకు తీసుకెళ్ళింది. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల‌ను అడ్డుకుంటూ త‌మ‌ను తాము ర‌క్షించుకునేలా ఆమె పాద‌ర‌క్ష‌లు త‌యారు చేసింది.

కర్ణాటక కల్బుర్గిలోని ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్ లో 10 త‌ర‌గ‌తి చ‌దువుతున్న విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్థిని అత్యాచార నిరోధక పాదరక్షలను( యాంటీ రేప్ ఫుట్ వేర్‌) రూపొందించింది. త‌మ‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేస్తున్న పోకిరిగాళ్ల‌నుంచి త‌మ‌ను తాము రక్షించుకోవడానికి మహిళ‌ల‌కు ఈ పాదరక్ష‌లు ఎంతో సహాయపడుతాయ‌ని ఆ బాలిక తెలిపింది.

అత్యాచార నిరోధక పాదరక్షలు ఎలా పని చేస్తాయి..?

త‌న‌పై దాడి సమయంలో బాధితురాలు ఈ అత్యాచార నిరోధక పాదరక్షలు వాడితే రేపిస్ట్‌కు తీవ్ర హాని కలుగుతుందని విజయలక్ష్మి వివరించింది. మహిళలకు భద్రత కల్పించే ఈ పాదరక్షల్లో అమ‌ర్చిన ఒక పరికరం లైంగికంగా వేధించేవారిని విద్యుదాఘాతానికి గురి చేస్తుందని ఆమె చెప్పారు. ఈ పాదరక్షలు, బ్యాటరీతో నడిచే విధంగా త‌యారు చేశారు, అత్యాచారం చేసే వ్యక్తిని దాడి చేసే సమయంలో బాధితురాలు తన్నితే ఆ వ్య‌క్తిని విద్యుదాఘాతానికి గురిచేసి గాయపరుస్తుంద‌ని తెలిపింది. దీంతో అత‌డి బారి నుంచి సురక్షితంగా తప్పించుకోవచ్చని విజ‌య‌ల‌క్ష్మి చెప్పింది.

అంతేగాక‌, ఈ పాద‌ర‌క్ష‌ల్లో ఒక జిపిఎస్ (GPS) ట్యాగ్ కూడా ఉంటుంద‌ని ఆమె తెలిపింది. దీని ద్వారా అమ్మాయి కి సంబంధించిన ఎమ‌ర్ఝెన్సీ నంబ‌ర్ కు హెచ్చ‌రిక‌ను కూడా పంపుతుందిట‌. దీంతో ఆమె ప్ర‌మాదంలో ఉంద‌ని అవ‌తలివారికి స‌మాచారం అందుతుంది. ఇది వారికి బాధితురాలు ఎక్క‌డ ఉంద‌నే లొకేష‌న్ వివ‌రాలు కూడా పంపుతుంది.

తాను 7వ త‌ర‌గ‌తిలో ఉన్ప‌ప్పుడే ఈ ప్రాజెక్టును ప్రారంభించాన‌ని విజ‌య‌ల‌క్ష్మి తెలిపింది. ఆమె రూపొందించిన ఈ ' యాంటీ రేప్ ఫుట్ వేర్' 'ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్వెన్ష‌న్ అండ్ ఇన్నోవేష‌న్ అవార్డు'తో పాటు అనేక‌ అవార్డుల‌ను గెలుచుకుంది. ఈ ఆవిష్క‌ర‌ణ‌తో మహిళల భద్రతను మరో స్థాయికి తీసుకెళ్లింద‌ని బాలిక పై ప్రశంస‌లు కురిపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News