రాజ్యాంగం నుంచి ఆ పదాలు తొల‌గింపు.. కేంద్రం క్లారిటీ..!

సెక్యులర్‌, సోషలిస్టు పదాలు 1976లో చేర్చిన మాట వాస్తవమేనని, కానీ ఇవాళ ఎంపీల‌కు ఇచ్చిన కాపీల్లో ఆ పదాలు లేకుంటే ఆలోచించాల్సిన విషయమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి.

Advertisement
Update:2023-09-20 15:00 IST

నూత‌న‌ పార్లమెంట్‌ బిల్డింగ్‌లో సమావేశాల వేళ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పార్లమెంట్‌ సభ్యులకు ఇచ్చిన గిఫ్టు బ్యాగుల్లోని కాన్‌స్టిట్యూషన్ ఇంగ్లిష్‌ కాపీల్లోని ప్రవేశికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో విపక్షాలు మోడీ సర్కార్‌పై మండిపడ్డాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించాయి.

ఈ వివాదంపై న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ స్పందించారు. ఎంపీలకు గిఫ్టుగా ఇచ్చిన కాన్‌స్టిట్యూషన్‌ బుక్‌లోని ప్రవేశిక.. ఒరిజినల్‌ వెర్షన్ అని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని రాసినప్పుడు సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని, 1976లో 42వ సవరణతో వీటిని చేర్చారని తెలిపారు. అయితే కేంద్రమంత్రి ఇచ్చిన వివరణ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. కేంద్ర ప్రభుత్వం సరైన ప్రక్రియను అనుసరించకుండా భారీ మార్పులు చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి.

సెక్యులర్‌, సోషలిస్టు పదాలు 1976లో చేర్చిన మాట వాస్తవమేనని, కానీ ఇవాళ ఎంపీల‌కు ఇచ్చిన కాపీల్లో ఆ పదాలు లేకుంటే ఆలోచించాల్సిన విషయమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. సీపీఐ-ఎం సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. పెద్ద నేరంగా అభివర్ణించారు.

నూతన పార్లమెంట్‌లో అడుగుపెడుతున్న సందర్భంగా ఎంపీలకు రాజ్యాంగం కాపీలను గిఫ్టుగా అందించారు. ఇందులోని రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్రదేశంగా అభివర్ణించింది. ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన టైంలో 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో అనేక మార్పులు జరిగాయి. ఇందులో సార్వభౌమ, ప్రజాస్వామ్య పదాల మధ్య సోషలిస్టు, లౌకిక పదాలను చేర్చారు.

*

Tags:    
Advertisement

Similar News