కేంద్రం నియమించిన MSP ప్యానెల్‌ను తిరస్కరించిన రైతు స‍ంఘాలు

కేం ద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'కనీస మద్దతు ధర ప్యానెల్' రైతు వ్యతిరేక ప్యానెల్ అని ఆరోపించిన సంయుక్త కిసాన్ మోర్చా ఆ ప్యానెల్ ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించి‍ంది.

Advertisement
Update:2022-07-19 08:30 IST

మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలోని కనీస మద్దతు ధర (MSP) ప్యానెల్ ను సంయుక్త కిసాన్ మోర్చా (SKM) తిరస్కరించింది. ఆ ప్యానెల్ లో ప్రభుత్వం నియమించిన రైతు నాయకులు వ్యవసాయ చట్టాలకు మద్దతుదారులని SKM ఆరోపించింది.

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ MSPప్యానెల్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఎనిమిది నెలల తర్వాత ప్రభుత్వం సోమవారం కనీస మద్దతు ధర (MSP)పై కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నుండి ముగ్గురు సభ్యులను ప్యానెల్‌లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

"ఈ రోజు(మంగళవారం) మేము సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల సమావేశాన్ని నిర్వహించాము. నాయకులందరూ ప్రభుత్వ ప్యానెల్‌ను తిరస్కరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన మా ఆందోళనతో ఎలాంటి సంబంధం లేని రైతు నాయకులను ప్రభుత్వం ప్యానెల్‌లో చేర్చుకుంది, "అని SKM నాయకుడు అభిమన్యు కోహర్ మీడియాతో చెప్పారు.

ప్రభుత్వం కొంతమంది కార్పొరేట్ వ్యక్తులను కూడా MSP ప్యానెల్‌లో సభ్యులుగా చేసిందని శ్రీ కోహర్ చెప్పారు. SKM తన స్టాండ్‌పై సాయంత్రం వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తుందని ఆయన‌ చెప్పారు.

SKM గొడుగు కింద, వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఒక సంవత్సరం పాటు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

గత ఏడాది నవంబర్‌లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ, కనీస మద్దతు ధర మీద‌ రైతుల డిమాండ్‌పై చర్చించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

దీనికి సంబంధించి కమిటీని ప్రకటిస్తూ వ్యవసాయ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ప్యానెల్‌లో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ నుండి వ్యవసాయ-ఆర్థికవేత్తలు CSC శేఖర్ , IIM- అహ్మదాబాద్ నుండి సుఖ్‌పాల్ సింగ్, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (CACP) సీనియర్ సభ్యుడు నవీన్ P. సింగ్ ఉంటారు.

రైతు ప్రతినిధులలో, జాతీయ అవార్డు గెలుచుకున్న రైతు భరత్ భూషణ్ త్యాగి, SKM నుండి ముగ్గురు సభ్యులు, గున్వంత్ పాటిల్, కృష్ణవీర్ చౌదరి, ప్రమోద్ కుమార్ చౌదరి, గుణి ప్రకాష్, సయ్యద్ పాషా పటేల్‌లతో సహా ఇతర రైతు సంఘాల నుండి ఐదుగురు సభ్యులు ఉంటారు.

రైతు సహకార సంఘంలోని ఇద్దరు సభ్యులు, ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ సంఘాని, సిఎన్‌ఆర్‌ఐ ప్రధాన కార్యదర్శి బినోద్ ఆనంద్‌లు ప్యానెల్‌లో ఉన్నారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయాల సీనియర్‌ సభ్యులు, ఐదుగురు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News