నోట్ల రద్దు జరిగి ఆరేళ్ళ‌ తర్వాత కూడా తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కలే... ఒప్పుకున్న నిర్మలా సీతారామన్

పెద్ద నోట్లు రద్దు చేసిన దగ్గరి నుంచి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ పెరుగుతూనే ఉంది.2014లో 7.73 లక్షలుండగా 2018 మార్చ్ లో రూ.18.29 లక్షల కోట్లు, 2019 మార్చిలో రూ.21.36 లక్షల కోట్లు , మార్చి 2020లో రూ.24.47 లక్షల కోట్లు, మార్చి 2021 రూ.28.53 లక్షల కోట్లు, 2022 మార్చ్ నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisement
Update:2023-03-14 08:24 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రోజుల తరబడి అతి పెద్ద క్యూలు...క్యూలలోనే కొందరి మరణాలు... తీవ్రమైన నగదు కొరత.... అనేక మంది చిన్న వ్యాపారాలు మూసి వేత.... వీటన్నింటికీ కారణమైన బిజెపి నేతృత్వంలోని కేంద్ర సర్కార్ లోపభూయిష్ట నోట్ల రద్దు చర్యకు పాల్పడిన‌ ఆరేళ్ల తరువాత దాని లక్ష్యం విఫలమైందని కేంద్రం పరోక్షంగా ఒప్పుకుంది. చెలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ. 2014లో రూ.13 లక్షల కోట్లు ఉండగా 2022 మార్చిలో 31.33 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అంటే తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థనూ తీసుకరావాలన్న‌ లక్ష్యం విఫలమైంది.

అదేవిధంగా, నోట్ల పరిమాణం కూడా మార్చి 2014లో 7.73 లక్షలుండగా , 2022 మార్చి నాటికి 13.05 లక్షలకు గణనీయంగా పెరిగింది, నోట్ల రద్దు కాలంలో కూడా ఎలాంటి తగ్గుదల కనిపించలేదు.

చెలామణిలో ఉన్న నగదును తగ్గించడం ద్వారా నల్లధనాన్ని తగ్గించడమే నోట్ల రద్దు లక్ష్యం. డీమోనిటైజేషన్ ప్రకటించిన తర్వాత ఆ లక్ష్యం నెరవేరలేదు.

పెద్ద నోట్లు రద్దు చేసిన దగ్గరి నుంచి చలామణిలో ఉన్న కరెన్సీ విలువ పెరుగుతూనే ఉంది.2014లో 7.73 లక్షలుండగా 2018 మార్చ్ లో రూ.18.29 లక్షల కోట్లు, 2019 మార్చిలో రూ.21.36 లక్షల కోట్లు , మార్చి 2020లో రూ.24.47 లక్షల కోట్లు, మార్చి 2021 రూ.28.53 లక్షల కోట్లు, 2022 మార్చ్ నాటికి రూ.31.33 లక్షల కోట్లకు చేరుకుంది.

కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, ''నవంబర్ 8, 2016న ప్రకటించిన నోట్ల రద్దు లక్ష్యం నకిలీ కరెన్సీ నోట్లను, నల్లధనాన్నిఅరికట్టడం,డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లడమే " అని ప్రకటించారు. ఆమె ప్రకటన ప్రకారమే వాళ్ళు నిర్దేశించుకున్న ఏ ఒక్క లక్ష్యం కూడా నెరవేరలేదు.

Tags:    
Advertisement

Similar News