సీఎం సిద్ధరామయ్యకు షాక్.. ముడా చీఫ్‌ రాజీనామా

కన్నడ సీఎం సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా కుంభకోణం వ్యవహారంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement
Update:2024-10-16 16:50 IST

కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు మరో షాక్ తగిలింది. ముడా కుంభకోణం వ్యవహారంలో మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. సీఎం సిద్ధరామయ్యకు మరిగౌడ అత్యంత సన్నిహితుడంటూ పేరుంది. ప్రస్తుతం హెల్త్ ఇష్యూతోనే రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ముడా స్కామ్‌లో చిక్కుకున్న ముఖ్యంపై ఎంక్వరీ జరుగుతున్న వేళ.. మరిగౌడ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముడా నుంచి తన సీఎం సతీమణికి అనుచితంగా లబ్ధి కలిగించినట్లు సిద్దాపై ఆరోపణలున్నాయి. దీంతో కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు, ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వివాదం నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు ఇటీవలే వెనక్కి కూడా తీసుకున్నారు. ముడా స్కామ్ నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని సీఎం భార్య మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)కి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 14 ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ సేల్‌డీడ్‌ను రద్దు చేయాలని ముడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కుంభకోణం వ్యవహారంలో సిద్ధరామయ్యపై విచారణ కొనసాగుతోంది.ఇక ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయి విచారణను ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య ఏ క్షణంలోనైనా పదవిని కోల్పోతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సన్నిహితుడుగా భావిస్తున్న ముడా చీఫ్‌ రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News