మమతకు షాక్..నందిగ్రామ్ లో టీఎంసీకి మరో ఓటమి

పశ్చిమబెంగాల్లో ఏడాదిన్నర కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే.

Advertisement
Update:2022-09-19 16:57 IST

పశ్చిమబెంగాల్లో ఏడాదిన్నర కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తన అనుచరుడిగా ఉంటూ ఆ తర్వాత బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ కాగా టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిని ఓడించడం కోసం మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓడారు.

ఆ తర్వాత ఆమె చట్టసభలకు ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ తర్వాత భవానీపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా తాజాగా మరోసారి నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పార్టీకి ఓటమి ఎదురైంది. నందిగ్రామ్ లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ టీఎంసీ అధికారంలో ఉండేది. ఆదివారం భేకుటియా సమభే కృషి సమితికి ఎన్నికలు జరిగాయి. అయితే అక్కడ ఊహించని విధంగా బీజేపీ టీఎంసీపై ఏకపక్ష విజయాన్ని సాధించింది.

ఏకంగా 12 సీట్లకు గాను 11 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. నందిగ్రామ్ లో ఏడాదిన్నర తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి తన సత్తా చాటారు. బీజేపీ విజయం సాధించడం పట్ల సువేందు అధికారి మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థులను గెలిపించి నందుకు నియోజకవర్గం, భేకుటియా సమభే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్తులో మరో గొప్ప విజయం సాధించేందుకు బాటలు వేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News