బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. శశి థరూర్ పీఏ అరెస్ట్‌

కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న శివకుమార్ ఎంపీ శశి థరూర్ పీఏ అని చెబుతుండగా...థరూర్ మాత్రం శివకుమార్ తన వద్ద పనిచేసిన మాజీ సిబ్బందిగా పేర్కొనడం గమనార్హం.

Advertisement
Update:2024-05-30 15:13 IST

ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎంపీ శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు శివకుమార్ అరెస్ట్ అయ్యాడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వద్ద శివకుమార్ అనే వ్యక్తి పీఏగా పనిచేస్తున్నాడు. అతడు తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు.

దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి శివకుమార్ ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాడు. అత‌డి నుంచి 500 గ్రాముల బంగారాన్ని తీసుకుంటుండగా కస్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శివ కుమార్‌తో పాటు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శివకుమార్ అరెస్టుపై ఎంపీ శశి థరూర్ స్పందించారు. తన మాజీ సిబ్బందిలో ఒకరికి సంబంధించిన సంఘటన గురించి విని తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. శివకుమార్ 72 ఏళ్ల రిటైర్డ్ వ్యక్తి అని.. అతను కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తెలిపారు.

శివ కుమార్ కారుణ్య, పార్ట్ టైం ప్రాతిపదికన ఉద్యోగంలో నియమితులైన‌ట్లు చెప్పారు. బంగారం స్పగ్లింగ్ విషయంపై దర్యాప్తు అధికారులకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని శశి థరూర్ తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాగా, కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్న శివకుమార్ ఎంపీ శశి థరూర్ పీఏ అని చెబుతుండగా...థరూర్ మాత్రం శివకుమార్ తన వద్ద పనిచేసిన మాజీ సిబ్బందిగా పేర్కొనడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News