అమెరికాలో వ్యభిచారం.. ఐదుగురు తెలుగు యువకులు అరెస్టు!

అరెస్టయిన వారిలో ఎక్కువ మంది చదువుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెంటాన్ కౌంటీ పోలీస్ అధికారులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

Advertisement
Update:2024-08-22 12:02 IST

అమెరికాలో ఐదుగురు తెలుగు యువకులు వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది. ఈనెల 14, 15 తేదీల్లో డెంటాన్ కౌంటీ పోలీసులు వ్యభిచార కార్యకలాపాల నియంత్రణ కోసం స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు డెంటాన్‌ కౌంటీ పోలీసులు. వీరిలో 14 మంది వ్యభిచారం కోసం అభ్యర్థిస్తూ పట్టుపడగా.. ఇద్దరు 18 ఏళ్లలోపు వారిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



అరెస్టయిన వారిలో ఐదుగురు తెలుగువాళ్లు సహా మొత్తం ఏడుగురు భారతీయులు ఉన్నారు. అరెస్టయిన తెలుగువారిలో బండి నిఖిల్, గల్లా మోనిష్‌, కుమ్మరి నిఖిల్, రాయపాటి కార్తీక్‌, మేకల జైకిరణ్ రెడ్డి ఉన్నారు. నిఖిల్ బండి, నిఖిల్‌ కుమ్మరిలపై అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని అభియోగం మోపగా.. మోనిష్ గల్లా, కార్తీక్ రాయపాటి డబ్బు ఆశ చూపి వ్యభిచారం అభ్యర్థించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.



మేకల జై కిరణ్‌పై మైనర్‌ను ప్రలోభాలకు గురిచేసినట్లు అభియోగాలు మోపారు. అమెరికాలో మైనర్‌లను ఇబ్బందులకు గురి చేసినట్లు తేలితే కఠిన శిక్షలు ఎదుర్కొంటారు. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది చదువుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డెంటాన్ కౌంటీ పోలీస్ అధికారులు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇక అమెరికాలో తెలుగు వ్యక్తులు అరెస్టు కావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఇద్దరు యువతులు ఓ సూపర్‌ మార్కెట్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం వల్లే విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News