5గురిని హత్య చేశానని చెప్పిన బీజేపీ నేత... సన్మాన బృందాన్ని పంపండంటూ టీఎంసీ ఎంపీ వ్యంగ్యం
పెహ్లూ ఖాన్ తో సహా ఐదుగురిని తాము కొట్టి చంపామని గర్వంగా ప్రకటించుకున్న రాజస్థాన్ బీజేపీ నేత జ్ఞాన్ దేవ్ ఆహుజా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ లో 11 మంది రేపిస్టులకు సన్మానం చేసిన బృందాన్ని రాజస్థాన్ పంపి ఆహుజాను కూడా సన్మానించండంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యంగ్యంగా స్పందించారు.
ఆవుల అక్రమ రవాణాకు పాల్పడిన అయిదుగురిని తాను చంపేశానంటూ రాజస్థాన్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ ఆహుజా చేసిన 'పాంచ్ మారే' వ్యాఖ్య వైరల్ అవుతోంది. దీన్ని తన 'హీరోచిత' పనిగా ఆయన అభివర్ణించుకున్నాడు. పెహ్లూ ఖాన్ తో సహా తాము ఐదుగురిని కొట్టి చంపామని గొప్పగా చెప్పుకున్న ఆయన ఇలా మరెవరయినా ఆవులను చంపినా వారిని కూడా వదిలిపెట్టనని హెచ్చరించాడు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. . బిల్కిస్ బానో కేసులో జైలు నుంచి విడుదలైన 11 మంది రేపిస్టులను పూలమాలలతో సత్కరించినవారిని కూడా గుజరాత్ నుంచి రాజస్థాన్ పంపాలని ఆమె అన్నారు. ఆ మీసాల 'హీరో'.. తనేదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫీలవుతూ, రాక్షసానందం పొందుతున్నాడని ఇప్పుడు బీజేపీ .. రేపిస్టుల సన్మాన బృందాన్ని ఆయన వద్దకు పంపి ఆయనను కూడా సన్మానించాలని ఆమె వ్యంగ్యంగ ట్వీట్ చేశారు. గుజరాత్ లోని విశ్వహిందూ పరిషద్ నేతలు ఆ నిందితులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి పూలమాలలతో స్వాగతం చెప్పిన వార్త హాట్ హాట్ గా సర్క్యులేట్ అయింది.
రేపిస్టులను ఇలా సత్కరించినవారిని రాజస్థాన్ పంపితే వీళ్ళు జ్ఞాన్ దేవ్ ఆహుజాకు పూలమాలలు వేస్తారని మహువా సెటైర్ వేశారు. ఆహూజా.. చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ అయింది. గోవులను ఎవరు చంపినా, లేదా వాటిని ఎవరు కబేళాకు పంపినా..అక్రమ రవాణా చేసినా.. ఆ వ్యక్తులను హతమార్చడానికి పార్టీ కార్యకర్తలకు తాను స్వేచ్ఛనిస్తున్నానని ఆహూజా అన్నారు. వారు బెయిల్ పై నిర్దోషులుగా విడుదలయ్యేలా చూస్తానని కూడా చెప్పారు. ఇంతగా రెచ్చిపోయిన ఈ వ్యక్తి పట్ల .. గుజరాత్ రేపిస్టుల సత్కార బృందం ఎలా స్పందిస్తుందని మహువా మొయిత్రా ప్రశ్నించారు.
11 మంది రేపిస్టుల విడుదల, సత్కార బృందం, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ ఆహుజా, బీజేపీ, 5 గురి హత్య, మొయిత్రా స్పందన
11 rapists release, felicitation squad, tmc mp mahua moitra, rajasthan ex mla gyandev ahuja, bjp, 5 lynched