ఎల్లలు దాటిన అంధ భక్తి ఎలా ఉంటుందో ఒక్క సారి చూసి, విని తరించండి!

గుజరాత్ లో ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతున్నది. వివిధ పార్టీల తరపున యువకులే కాక, పిల్లలు కూడా పాల్గొంటున్నారు. అలా ప్రచార జోష్ లో ఉన్న ఓ గుంపు వద్ద ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ టీం ఆగింది.

Advertisement
Update:2022-11-27 19:49 IST

భక్తికి కూడా ఓ హద్దు ఉంటుంది. హద్దులూ...ఎల్లలూ దాటిన అంధ భక్తి ప్రస్తుతం దేశంలో రాజ్యం చేస్తున్నది. ఆ భక్తిలో మెదడూ, కళ్ళూ మూసుకపోయి వాళ్ళేం మాట్లాడుతున్నారో , వాళ్ళేం చేస్తున్నారో కూడా తెలియకుండా దాదాపు అల్జీమర్స్ వ్యాధి వచ్చిన విధంగా మారిపోతున్నారు. అంధ భక్తి కొందరినీ సైకోలుగా మారిస్తే, మరి కొందరిని అబద్దాల రాయుళ్ళుగా, కోతల రాయూళ్ళుగా మారుస్తున్నది. అబద్దాలో నిజాలో వాళ్ళకవసరంలేదు వాళ్ళు భక్తితో కొలిచే నాయ‌కుడినో, పార్టీనో మోయడమే వాళ్ళ టార్గెట్.

గుజరాత్ లో ఎన్నికల ప్ర‌చారం జోరుగా సాగుతున్నది. వివిధ పార్టీల తరపున యువకులే కాక, పిల్లలు కూడా జోరు మీద పాల్గొంటున్నారు. అలా ప్రచార జోష్ లో ఉన్న ఓ గుంపు వద్ద ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ టీం ఆగింది. ఆ ప్ర‌చార కార్యకర్తలంతా కాషాయ కండువాలు వేసుకొని ఉన్నారు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు జర్నలిస్టు. తానుమాట్లాడుతానంటూ 11వ తరగతి చదువుతున్న ఓ పిల్లవాడో లేక యువకుడో ముందుకొచ్చాడు. ఇక రిపోర్టర్ ప్రశ్నలు ఆ యువకుడి జవాబులు మొదలయ్యాయి.

రిపోర్టర్: ఏ చదువుతున్నావు

కాషాయ యువకుడు: కాలేజ్

రిపోర్టర్: గవర్నమెంట్ కాలేజా , ప్రైవేటు కాలేజా?

కాషాయ యువకుడు: ప్రైవేటు

రిపోర్టర్: ప్రభుత్వ కాలేజ్ లో ఎందుకు చదవటం లేదు.

కాషాయ యువకుడు: ప్రభుత్వ కాలేజ్ లో చదువులు బావుండవు.

రిపోర్టర్: అందుకు కారణమెవ్వరు ?

కాషాయ యువకుడు: మీకు తెలుసు కారణమెవ్వరో , ప్రభుత్వమే కారణం

రిపోర్టర్: ఇక్కడ 27 ఏళ్ళుగా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది

కాషాయ యువకుడు: బీజేపీ ప్రభుత్వం కారణం కాదు

రిపోర్టర్: మరి ఏ ప్రభుత్వం కారణం?

కాషాయ యువకుడు: దీనికి బాధ్యత‌ ఆప్ సర్కార్ దే.

రిపోర్టర్: ఆమ్ ఆద్మీ సర్కార్ ఢిల్లీలో ఉంది. గుజరాత్ లో ఉన్నది బీజేపీ సర్కార్ కదా ?

కాషాయ యువకుడు: కొద్దిగా ఆగు, ఇప్పుడు నేనేమి చెప్పదల్చుకోలేదు.(అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు)

ఇదీ అంధభక్తుల కథా కమామీషు.... అది చూస్తున్న వాళ్ళకు ఆ యువకుడి కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి డ్రైనేజీ కాల్వలవలె పారుతున్న భక్తి కనిపించింది తప్ప ఏ కోశానా నిజాయితీ మాత్రం కనిపించలేదు.



Tags:    
Advertisement

Similar News