'మమ్మల్ని బాధితులుగానే చూడండి..హంత‌కులుగా కాదు'

కాలమే ఎవరు టెర్రరిస్టో, ఎవరు స్వాతంత్య్ర‌ సమరయోధుడో నిర్ణయిస్తుంది. అయితే తమపై టెర్రరిస్టులమని నిందలు మోపినప్పటికీ కాలం మమ్మ‌ల్ని నిర్దోషులుగా నిర్ణయిస్తుంది అని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి రవిచంద్రన్ అన్నారు. ఆ పేలుడులో మరణించిన వారి కుటుంబాల ప‌ట్ల పశ్చాత్తాపపడుతున్నట్లు మరో దోషి నళిని తెలిపారు.

Advertisement
Update:2022-11-13 14:25 IST

త‌మ‌ను హంత‌కులు, తీవ్ర‌వాదులలాగా కాకుండా బాధితుల‌గానే చూడాల‌ని రాజీవ్ గాంధీ హ‌త్య‌కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకరైన ఆర్‌పి రవిచంద్రన్ కోరారు. "ఉత్తర భారత ప్రజలు మమ్మల్ని తీవ్రవాదులు లేదా హంతకులుగా కాకుండా బాధితులుగా చూడాలి. కాలమే ఎవరు టెర్రరిస్టో, ఎవరు స్వాతంత్య్ర‌ సమరయోధుడో నిర్ణయిస్తుంది. అయితే తమపై టెర్రరిస్టులమని నిందలు మోపినప్పటికీ కాలం మమ్మ‌ల్ని నిర్దోషులుగా నిర్ణయిస్తుంది," అన్నారాయన. శనివారం జైలు నుంచి విడుదలైన త‌ర్వాత ఆయ‌న ఒక వార్తా సంస్థ‌తో మాట్లాడుతూ... త‌మ‌ను కాలమే"అమాయకులు"గా నిర్ణయిస్తుందని అన్నారు. శుక్ర‌వారంనాడు సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు ఈ కేసులో దోషులు విడుద‌ల‌య్యారు.

ఇదే కేసులో విడుద‌లైన మ‌రో దోషి న‌ళిని శ్రీ‌హ‌ర‌న్ మాట్లాడుతూ.. , 32 సంవత్సరాల శిక్ష సమయంలో తనకు సహాయం అందించినందుకు తమిళనాడు,కేంద్ర ప్రభుత్వాలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. నళిని శ్రీహరన్ మాట్లాడుతూ.. ఆ పేలుడులో మరణించిన వారి కుటుంబాల ప‌ట్ల పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపారు. "నేను వారి కోసం చాలా చింతిస్తున్నాను. మేము దాని గురించి ఆలోచిస్తూ చాలా సంవత్సరాలు గడిపాము . మమ్మల్ని క్షమించండి" అని నళిని శ్రీహరన్ కోరారు. "వారు తమ ప్రియమైన వారిని కోల్పోయారు. వారు ఆ విషాదం నుండి బయటపడతారని నేను ఆశిస్తున్నాను" అని ఆమె అన్నారు. 32 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన తర్వాత నళిని శ్రీహరన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె తన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. దేశంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన మహిళా ఖైదీగా న‌ళిని శ్రీహరన్ రికార్డుల‌కు ఎక్కింది. ఈ రికార్డును ఏ మ‌హిళా తిర‌గ‌రాయ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాన‌ని ఆమె అన్నారు. ఎంతోకాలంగా త‌న కుటుంబీకులు ఎదురు చూస్తున్నార‌ని, ముందుగా తాను వారితో క‌లిసి ఉంటాన‌ని చెప్పారు. ఆమె విడుదలైన తర్వాత గాంధీ కుటుంబం నుండి ఎవరినైనా కలుస్తారా అని అడిగినప్పుడు, నళిని తాను ఎలాంటి ప్లాన్ చేయడం లేదని, "నా భర్త ఎక్కడికి వెళ్లినా ఆయ‌న‌తో పాటే" వెళ్తానని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News