ఉచితాలు టైం బాంబులాంటివి - ఎస్‌బీఐ
కొన్ని సంక్షేమ పథకాల వల్ల పేదలకు మంచి జరగుతుందని... కానీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచితంగా విద్యుత్, తాగునీరు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, సైకిళ్లతో పాటు రైతు రుణమాఫి వంటి హామీలు ఇస్తున్నాయని ఇవి సరైనవి కాదని నివేదికలో అభిప్రాయపడింది.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలను టైమ్ బాంబుతో పోల్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన నివేదిక. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. రాష్ట్రాలు ప్రకటించే సంక్షేమ పథకాల ఖర్చును జీఎస్‌డీపీలో ఒక శాతానికి పరిమితం చేయాలని, లేదా సొంత పన్నుల ఆదాయంలో ఒక శాతానికి సంక్షేమ భారం మించకుండా కట్టడి చేయాలని అభిప్రాయపడింది.
కొన్ని సంక్షేమ పథకాల వల్ల పేదలకు మంచి జరగుతుందని... కానీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఉచితంగా విద్యుత్, తాగునీరు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, సైకిళ్లతో పాటు రైతు రుణమాఫి వంటి హామీలు ఇస్తున్నాయని ఇవి సరైనవి కాదని నివేదికలో అభిప్రాయపడింది.
కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పాత పింఛన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చాయని.. చత్తీస్‌గడ్, ఝార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ పని చేయడం వల్ల రూ.3 లక్షల కోట్ల అదనపు భారం ఆ మూడు రాష్ట్రాలపై పడిందని గుర్తు చేసింది. ఈ మూడు రాష్ట్రాల పించన్ల భారం.. ఆ రాష్ట్రాల పన్ను ఆదాయం కంటే అధికంగా ఉందని గణాంకాలను వెల్లడించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పింఛన్ విధానంలోకి వెళ్తే భారం ఏటా రూ.31 లక్షల కోట్లకు చేరుతుందని ఇది ప్రమాదరకమని ఎస్‌బీఐ నివేదికలో వివరించింది. కాబట్టి ఈ చర్యలను నియంత్రించాలని సూచించింది. సుప్రీంకోర్టు ప్యానెల్ ద్వారా ఈ ఉచితాలను, మితిమీరిన ఎన్నికల హామీలను నియంత్రించాలని కోరింది.