తన పిల్లలను భారత్ రావద్దన్న ఆర్జేడీ లీడర్... అతను పాకిస్తాన్ వెళ్ళిపోవాలన్న బీజేపీ
"దేశ వాతావరణఎలా ఉందంటే... నేను ఒక వ్యక్తిగత ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను . నా కుమారుడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు, నా కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందింది. విదేశాల్లో ఉద్యోగాలు చూసుకోండి, వీలైతే అక్కడి పౌరసత్వాలు తీసుకోండి అని వారికి నేను చెప్పాను." ఒక కార్యక్రమంలో ఆజేడీ నేత సిద్ధిఖీ అన్నారు.
భారత దేశంలో పరిస్థితులు బాగాలేవని అందుకని విదేశాల్లో చదువుకుంటున్న తన పిల్లలను ఇక్కడికి తిరిగి రావద్దని చెప్పానని రాష్ట్రీయ జనతాదళ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ బారీ సిద్ధిఖీ అన్నారు. దేశంలోని ముస్లింలపై పక్షపాతం చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
"దేశ వాతావరణఎలా ఉందంటే... నేను ఒక వ్యక్తిగత ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను . నా కుమారుడు హార్వర్డ్‌లో చదువుతున్నాడు, నా కుమార్తె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందింది. విదేశాల్లో ఉద్యోగాలు చూసుకోండి, వీలైతే అక్కడి పౌరసత్వాలు తీసుకోండి అని వారికి నేను చెప్పాను." ఒక కార్యక్రమంలో ఆయన చెప్పాడు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ నాయకులు దీనిపై రచ్చ మొదలు పెట్టారు. సిద్ధిఖీ పాకిస్తాన్ వెళ్ళిపోవాలని బీజేపీ నాయకులు అంటున్నారు.
"సిద్ధిఖీ వ్యాఖ్యలు భారతదేశానికి వ్యతిరేకం. అతను ఇక్కడ ఉండలేకపోతున్నట్టైతే , అతను రాజకీయ నాయకుడిగా ఇక్కడ అనుభవిస్తున్న అధికారాలను వదులుకుని పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలి. అతన్ని ఎవరూ అడ్డుకోరు" అని బీహార్ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మండిపడ్డారు.
"సిద్ధిఖీ RJD చీఫ్ లాలూ ప్రసాద్ కు సన్నిహితుడు.అతని మాటలు అతని పార్టీ ముస్లింలను బుజ్జగించే సంస్కృతిని ప్రతిబింబిస్తాయి" అని బిజెపి నాయకుడు తెలిపారు.
అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యలను ఆర్జేడీ మిత్రపక్షం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్) సమర్థించింది.