సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు

భారత ప్రభుత్వం తరఫున రతన్‌ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Advertisement
Update:2024-10-10 10:27 IST

పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్నిముంబాయి కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్‌ టాటా పార్థివ దేహానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ నివాళులు అర్పించారు. ఉదయం 10.30 గంటలకు ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమౌతుంది. అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రతన్‌ టాటా మృతికి సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నోయెల్‌ టాటాతో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. భారత ప్రభుత్వం తరఫున రతన్‌ టాటా అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతారని నోయెల్‌కు ప్రధాని తెలిపారు. ప్రధాని లావోస్‌ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో అమిత్‌ షా పర్యవేక్షిస్తారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. నైతికత, వ్యవస్థాపకత ఆదర్శ సమ్మేళనం రతన్‌ టాటా. భారతదేశం పారిశ్రామికంగా వృద్ది చెందడలో కీలక పాత్ర పోషించారని మహారాష్ట్ర సీఎం ఏక్‌ నాథ్‌ షిండే పోస్టు పెట్టారు. రతన్‌ టాటా ముంబాయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

Tags:    
Advertisement

Similar News