కడుపు నొప్పితో హాస్పిటల్‌కి.. డాక్టర్స్ షాక్.!

దాదాపు రెండేళ్లుగా అత‌డు కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతం అన్ని వస్తువులు కడుపులో నుంచి తీసివేసినప్పిటికీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదన్నారు.

Advertisement
Update:2023-09-29 11:21 IST

కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి సర్జరీ చేసిన డాక్టర్లు.. కడుపులో ఉన్న వస్తువులు చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని మోగాలో జరిగింది. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన జ్వరం, కడుపునొప్పితో స్థానిక మెడిసిటి హాస్పిటల్‌లో చేరాడు. రెండు రోజులుగా వాంతులతో బాధపడుతున్నట్లు కూడా డాక్టర్లకు చెప్పాడు. అయితే కడుపు నొప్పి ఎంతకు తగ్గకపోవడంతో అతనికి ఎక్స్‌రే తీసిన డాక్టర్లు.. షాక్‌కు గురయ్యారు.

ఎక్స్‌రే పరిశీలించిన డాక్టర్లు కడుపులో భారీగా మెటల్ వస్తువులను గుర్తించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి అతని కడుపులో నుంచి దాదాపు వంద రకాలకు పైగా మెటల్‌ వస్తువులను బయటకు తీశారు. ఇందులో ఇయర్‌ఫోన్స్‌, వాషర్స్‌, నట్లు, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్‌, బటన్స్‌, హెయిర్‌ క్లిప్స్‌, జిప్పర్ ట్యాగ్, మార్బుల్‌, సేఫ్టీ పిన్‌ లాంటి వస్తువులున్నాయి.

దాదాపు రెండేళ్లుగా అత‌డు కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతం అన్ని వస్తువులు కడుపులో నుంచి తీసివేసినప్పిటికీ.. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదన్నారు. చాలా కాలంగా అవి కడుపులో ఉండటం వ‌ల్ల ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీశాయన్నారు.

ఆ వస్తువులు ఎలా మింగాడనే విషయం తమకు కూడా తెలియదంటున్నారు కుటుంబ సభ్యులు. అయితే అతను కొన్ని రోజులుగా మానసిక‌ సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పారు. మోగాలో హాస్పిటల్‌కు రావడానికి ముందు చాలా మంది డాక్టర్లను సంప్రదించామని.. కానీ ఎవరూ అతని నొప్పి వెనుక కారణాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని చెప్పారు.


Tags:    
Advertisement

Similar News